తిరుమల కొండ పైన ఉన్న ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి చాలా సులువైన మార్గాలు, బస్సు, రైలు, ఫ్లైట్ వంటి వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు ఉన్నాయి. తిరుపతి వరకు చేరుకున్న తర్వాత తిరుమల కొండ పైకి బస్సు లో లేదా నడక దారిలో ఆలయానికి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
- రోడ్డు మార్గంలో తిరుమల ఆలయానికి చేరాలి అనుకునే భక్తులు తిరుపతి నుంచి ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది.
- తిరుపతి కి చేరుకోవడానికి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ , వెల్లూర్ వంటి ఏరియాల నుండి డైరెక్ట్ బస్సు అందుబాటులో ఉంటాయి.
- బస్సు మాత్రమే కాక టాక్సీలు లేదా ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
- తిరుమల కొండ పైకి చేరుకునే ఘాట్ రోడ్ తెల్లవారుజామున 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు క్లోజ్ చేయబడి ఉంటుంది.
రైలు మార్గం
- తిరుమలకు రైల్వే స్టేషన్ లేదు. తిరుపతి స్టేషన్ కు చేరుకొని అక్కడ నుంచి తిరుమల ఆలయానికి బస్సు లో చేరుకోవచ్చు.
- తిరుపతి రైల్వే స్టేషన్ కి చేరుకోవటానికి ప్రతి ప్రముఖ నగర రైల్వే స్టేషన్ల నంచి ట్రైన్లు అందుబాటు లో ఉంటాయి.
- తిరుపతి మాత్రమే కాక రేణిగుంట రైల్వే స్టేషన్ కూడా తిరుమల ఆలయానికి సమీపంలో ఉంది. అక్కడ నుంచి తిరుమల కి బస్సు సౌకర్యం కూడా ఉంది.
ఫ్లైట్ మార్గం
తిరుపతి దగ్గరలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, న్యూ ఢిల్లీ, బెంగుళూరు వంటి ఎయిర్పోర్ట్ ల నుంచి తిరుపతి కి ఫ్లైట్ అందుబాటులో ఉంటాయి.
నడక మార్గం
- తిరుమల ఆలయానికి చేరుకోవడానికి నడక మార్గం లో కూడా చేరుకోవచ్చు. నడక మార్గాలు రెండు ఉన్నాయి.
- అవి అలిపిరి మెట్టు మార్గం మరియు శ్రీవారి మెట్టు మార్గం రెండు ఉన్నాయి.
- అలిపిరి మెట్టు మార్గం 11 KM లు మరియు శ్రీవారి మెట్టు మార్గం 6 KM లు దూరం ఉంటాయి.
- నడక మార్గాలలో వెళ్లే భక్తులకు టీటీడీ వారు సెక్యూరిటీ, ఫుడ్, డ్రింకింగ్ వాటర్ వంటి మరిన్ని సౌకర్యాలను అందిస్తున్నారు.
- వాటితో పాటు లగ్గేజ్ కౌంటర్ ఫెసిలిటీ ని కూడా అందిస్తున్నారు.