Menu
Thomala Seva Timings & Booking procedure, Timings & Details

తోమాల సేవ పూర్తి వివరాలు - Complete Details Of Thomala Seva

తోమాల అంటే పువ్వుల దండ అని అర్థం. ఈ సేవ ప్రాముఖ్యత స్వామి వారిని రకరకాల పువ్వులతో ప్రత్యేకంగా తయారు చేసిన పువ్వుల దండలు మరియు తులసి మాలలతో అలంకరించే సేవ. ఈ సేవ సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొల్పిన తర్వాత జరుగుతుంది. ఈ ఆర్జిత సేవలో స్వామి వారికి పూల అలంకరణకు డబ్బులు కట్టి తోడ్పడిన యాత్రిక గృహస్త యొక్క ప్రత్యేక శ్రద్ధను తీసుకురావడమే ఈ సేవ ఉద్దేశించబడింది.  ఈ సేవ ను తమిళం లో “తోడుత మలయి” అని పిలుస్తారు. తిరుమల ఆలయ  ప్రధాన మఠాధిపతి అయిన పెరియ జీయర్ స్వామి లేదా వారి శిష్యుడు యమునాధురై  నుంచి  పువ్వుల దండలను  జ్యోతి వెలుగులో జే గంటలు  లయబద్ధమైన తాళంలో మోగిస్తూ ఊరేగింపుగా తీసుకు వస్తారు.  ఆ పువ్వుల దండలను వేరు వేరు భాగాలు గా చేస్తారు. ఆ భాగాలు ఒక వరుసలో ఆ దండ పరిమాణం బట్టి ఆయా చోట్ల అలంకరిస్తారు. దాని వల్ల స్వామి వారి విగ్రహం అలంకరణ అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సేవ 25 నుంచి 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ ఆర్జిత సేవ కేవలం మంగళవారం, బుధవారం మరియు గురువారం ఉంటుంది. 

తోమాల సేవ టిక్కెట్టు ధర - Thomala Seva Ticket Price

తోమాల సేవ కు ఒక టిక్కెట్టు ధర రూ. 220 మరియు ఒక టిక్కెట్టుకు ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ టిక్కెట్టు తో ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తారు. 

తోమాల సేవ సమయం, రిపోర్టింగ్ సమయం మరియు రిపోర్టింగ్ ప్లేస్ - Thomala Seva Timings, Reporting Time & Reporting Place

ఈ సేవ ఉదయం 3:30 గంటలకు మొదలవుతుంది. ఈ సేవ లో పాల్గొనే వారు ఉదయం 3:00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ I దగ్గర రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

తోమాల సేవ టికెట్ కోటా - Thomala Seva Tickets Quota (How Many Thomala Seva Tickets Per Day)

ఈ సేవ కు టికెట్లు లక్కీ డిప్ సిస్టం ద్వారా విడుదల అవుతాయి. ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 11:00 గంటలకు లక్కీ డిప్  రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

తోమాల సేవ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? - How To Book Thomala Seva Tickets?

తోమాల సేవ టిక్కెట్లు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. 

తోమాల సేవ ఆన్లైన్ బుకింగ్ - Thomala Seva Online Booking

తోమాల సేవ ఆఫ్లైన్ బుకింగ్ - Thomala Seva Offline Booking

ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే తిరుమల CRO ఆఫీస్ లో లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దానికి మీరు మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్, మెయిల్ id వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ మీరు ముందు రోజు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల లోపు చేయించుకోవచ్చు. సాయంత్రం 6:00 గంటలకు లక్కీ డిప్ రిజల్ట్స్ విడుదల అయ్యాక మీరు తరువాతి రోజు సేవకి సెలెక్ట్ అయ్యారో లేదో తెలుస్తుంది.