తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా తిరుమల గిరి పై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే ఒక సంస్థ. ఈ సంస్థ దేవాలయం బాగోగులు చూసుకోవడం, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చూసుకుంటుంది. ఈ స్వతంత్ర సంస్థ ఒక్క తిరుమల ఆలయమే కాక తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలు అన్నిటికి ఆలయ బాగోగులు చూసుకుంటోంది. ఇప్పుడు మనం టీటీడీ వారి ఆధ్వర్యం లో ఉన్న ఆలయాలు ఏమిటో చూద్దాం.
తిరుపతి లో ఉన్న టీటీడీ ఆలయాలు TTD Temples In Tirupati
తిరుపతి లో ఉన్న ప్రముఖ ఆలయాలను టీటీడీ వారు నడిపిస్తున్నారు. అవి ఏంటంటే
- శ్రీ వకుళమాత ఆలయం, పాటకాల్వ
- శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు
- శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి
- శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం
- శ్రీ కపిల తీర్థం ఆలయం, తిరుపతి
- శ్రీ కోదండ రామస్వామి ఆలయం, తిరుపతి
- శ్రీ శ్రీనివాస ఆలయం, తిరుచానూరు
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీటీడీ ఆలయాలు TTD Temples In Andhra Pradesh
తిరుపతి లోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,అన్నమయ్య, చిత్తూరు ,తూర్పు గోదావరి , గుంటూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మరియు వై.యస్. ర్ వంటి జిల్లాలలో ఉన్న ప్రముఖ ఆలయాలను కూడా టీటీడీ వారు చూసుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రాంపచోడవరం
అనకాపల్లి జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఉపమాక
అన్నమయ్య జిల్లా
- శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం మరియు ఇతర ఆలయాలు, తాళ్ళపాక
- శ్రీ పట్టాభి రామ స్వామి ఆలయం, వాల్మీకిపురం
చిత్తూరు జిల్లా
- శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం
- శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం
- శ్రీ కరియా మాణిక్య స్వామి ఆలయం, నగిరి
- శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, బుగ్గ
- శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం, కార్వేటినగరం
- శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, తరిగొండ
- శ్రీ కారి వరద రాజ స్వామి ఆలయం, సత్రవాడ
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, కోసువారిపల్లె
- శ్రీ కోనేటిరాయస్వామి ఆలయం, కీలాపట్ల
- శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, కందులవారిపల్లె
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, బూరగమండ, సదుం
- శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం, పుంగనూరు
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కలిగిరికొండ
- శ్రీ వరద వెంకటేశ్వర స్వామి ఆలయం, అల్లతురు, కార్వేటినగరం
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, మంగళంపేట
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆవులపల్లి, సోమల
తూర్పు గోదావరి జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం
గుంటూరు జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం
కృష్ణా జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడ
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నిమ్మకూరు, పామర్రు
పార్వతి పురం మన్యం జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సీతంపేట
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
- శ్రీ ఆలాగు మల్లరి కృష్ణ స్వామి ఆలయం, మన్నారుపోలూరు
- శ్రీ కారియమాణిక్య స్వామి మరియు శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం, తుమ్మూరు
తిరుపతి జిల్లా
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తొండమానడు
- శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, చంద్రగిరి
విశాఖపట్నం జిల్లా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రుషికొండ
- శ్రీ బాలాజీ ఆలయం, అంతకపల్లి
విజయనగరం జిల్లా
- శ్రీ సీతా రామ స్వామి ఆలయం, సారిపల్లి
వై. యస్. ర్ జిల్లా
- శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, దేవునిగడప
- శ్రీ నరపుర వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మలమడుగు
- శ్రీ కోదండ రామ స్వామి ఆలయం ఒంటిమిట్ట
- శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం, నందలూరు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ ఆలయాలు TTD Temples In Other States
టీటీడీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. అవి:
హర్యానా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కురుక్షేత్ర
జమ్మూ & కాశ్మీర్
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మూ
కర్ణాటక
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, బెంగళూరు
మహారాష్ట్ర
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ముంబై
న్యూ ఢిల్లీ
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, న్యూ ఢిల్లీ
ఒడిశా
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భువనేశ్వర్
తమిళనాడు
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, చెన్నై
- టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్, వెల్లూర్
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కన్యాకుమారి
- శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, చెన్నై
తెలంగాణ
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, హిమాయత్ నగర్, హైదరాబాద్
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, జూబిలీ హిల్స్, హైదరాబాద్
ఉత్తరాఖండ్
- శ్రీ చంద్ర మౌలేశ్వర స్వామి ఆలయం, రిషికేశ్
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రిషికేశ్