ఈ హుండీ అంటే ఏమిటి ? What does E-Hundi Mean?
ఆలయాల్లో హుండీ చాలా ప్రాముఖ్యమైనది. భక్తులు తమ కోరికలు కోరుకుని హుండీ లో స్వామి వారిని దర్శనం చేసుకుని తమకు సాధ్యమైన కానుకలు హుండీలో వేస్తూ ఉంటారు. అలానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో కూడా హుండీలలో కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఆలయ హుండీ లో సమర్పించలేని వారు టీటీడీ వెబ్ సైట్ లో E-Hundi ద్వారా కానుకలు చెల్లించవచ్చు.
స్వామి వారి ఈ హుండీ లో కానుకలు ఎలా వెయ్యాలి? How to Sponsor in Sri Venkateswara Swamy E-Hundi?
- దాని కోసం మీరు టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ‘Srivari Hundi’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- తర్వాత మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలి అనుకున్నారో ఎంటర్ చేయాలి.
- ఇంకా ఆ అమౌంట్ మీ తరపున వేయాలా, లేక మీ భాగస్వామి తరపున, లేక పిల్లల తరఫున, లేక తల్లిదండ్రుల తరుపున అని సెలెక్ట్ చేసుకోవాలి.
- తర్వాత మీ పేరు ఎంటర్ చేసి మీరు ఏ సందర్భానికి కానుకలు వెయ్యాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పుట్టినరోజు, వెడ్డింగ్ యానివర్సరీ, మొదటి శాలరీ, ఇలా మీ సందర్భం ఏమిటో సెలెక్ట్ చేసుకోవాలి.
- అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Proceed to E-Hundi Offering” బటన్ ను ప్రెస్ చేయాలి
- అప్పుడు మీకు పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. UPI ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ ను పూర్తి చేయండి.
ఇలా మీరు ఏ సందర్భానికి కానుకలు వేయాలి అనుకున్నారో ఆ సందర్భానికి మీరు వేయాలి అనుకున్న కానుకలు ఈ హుండీ ద్వారా పంపించి స్వామి వారి ఆశీస్సులు పొందండి.