తిరుమల లో చాలా రకాల డొనేషన్స్ జరుగుతూ ఉంటాయి అని తెలిసిందే. అయితే అందులో SV Pranadana Trust Donations ఒకటి. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పేద పిల్లలు సరైన వైద్యం అందుకోలేకపోతున్నారు. వారికి మంచి వైద్యం అందించేలా టీటీడీ వారు సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ ను తిరుపతి లో ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న పేద పిల్లలకు మంచి వైద్యం అందించడానికి తోడ్పడుతున్నారు.
ఈ పిల్లల ఆసుపత్రి ప్రధాన లక్ష్యం హార్ట్ డిసార్డర్స్ తో బాధపడుతూ వేలల్లో ఉన్న పిల్లలకు చికిత్స, శిక్షణ మరియు పునరావాసం అందించడం. ఈ ఆసుపత్రి లో కార్డియాలజీ మాత్రమే కాక నెఫ్రోలజీ(కిడ్నీ), అఫ్తాల్మొలజీ(eye), గ్యాస్ట్రోఎంట్రాలజీ, GI tract neurology, పేడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, neonatology, oncology, paediatric rheumatology మరియు immunology వంటి అన్ని రకాల వైద్యాలు అందించేలా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
ఈ ఆసుపత్రిని 5 ఎకరాల స్థలం లో ఈ ఆసుపత్రి నిర్మించాలి అనే మంచి ప్రయత్నం కోసం టీటీడీ వారు ఈ డొనేషన్ ను ఏర్పాటు చేశారు. ఇంత మంచి కార్యానికి డొనేషన్ ఇస్తున్న భక్తులను ప్రశంసిస్తూ టీటీడీ వారు (Udayasthamana Sarva Seva Endowment Scheme )ఉదయాస్తమాన సర్వ సేవ ఎండోమెంట్ స్కీం (USSES) ని ఆఫర్ చేయాలి అనుకున్నారు. ఈ స్కీం S. V Pranadana Trust కు రూ. కోటి మరియు అంతకన్నా ఎక్కువ డొనేట్ చేసిన భక్తులకు అందిస్తున్నారు.