Menu
Suprabhata Seva Ticket Booking Procedure, Timings And Details

తిరుమల  లో సుప్రభాత సేవ అంటే ఏంటి?  What is Suprabhata Seva In Tirumala?

సుప్రభాతం అనేది ఒక సంస్కృత పదం. దానికి అర్థం “Good Morning”. తిరుమలలో  సూర్యోదయానికి ముందే మొట్ట  మొదటగా జరిగే సేవ ఈ సుప్రభాత సేవ. ఇది  గర్భ గుడి లో ఉన్న శయన మండపం దగ్గర శ్రీనివాసుని మేలుకొల్పేందుకు చేసే సేవ. సుప్రభాతం లో 29 శ్లోకాలు ఉంటాయి. అర్చకులు ఆ శ్లోకాలని  ఒకే శృతిలో పాడుతూ  శ్రీనివాసుని మేల్కొలుపుతారు. స్వామి వారి సన్నిధి లో బంగారు వాకిలి దగ్గర అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటారు. ఈ మొత్తం సేవ అరగంట వరకు ఉంటుంది. 

సుప్రభాత సేవ టికెట్లు ఎక్కడ  బుక్ చేసుకోవాలి? Where To Book Suprabhata Seva Tickets?

సుప్రభాత సేవ టిక్కెట్లు ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 

సుప్రభాత సేవ టిక్కెట్లు బుకింగ్ ప్రక్రియ  Suprabhata Seva Ticket Booking Procedure

సుప్రభాత సేవ టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ 

సుప్రభాత సేవకు ఆన్లైన్ లో లక్కీ డిప్ లో రిజిస్టర్ అయ్యి  అడ్వాన్స్  బుకింగ్  చేసుకోవచ్చు. 

సుప్రభాత సేవ టిక్కెట్లు ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ 

సుప్రభాత సేవ టిక్కెట్లు ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ముందు రోజు తిరుమల CRO ఆఫీస్ దగ్గరకు వెళ్లి మరుసటి రోజుకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లక్కీ డిప్ సిస్టం ద్వారా ఈ సేవ టికెట్ బుక్ అవుతుంది. అంటే మీరు ఎంచుకున్న సేవ కి ఆ రోజు మీ పేరు వస్తే మీకు టికెట్ కన్ఫార్మ్ అయినట్టు మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. ఐతే CRO ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సాయంత్రం 6:00 గంటలకు డిప్ రిజల్ట్స్ విడుదల అవుతాయి. 

తిరుమల సుప్రభాత సేవ రిపోర్టింగ్ ఎప్పుడు, ఎక్కడ చేయాలి? Tirumala Suprabhata Seva Reporting Time and Place?

సుప్రభాత సేవ చేసుకునే వారు ఉదయం 2:00 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సుప్రభాత సేవ లో పాల్గొనే వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ I దగ్గర రిపోర్ట్ చేయాలి. 

తిరుమల సుప్రభాత సేవ సమయం Tirumala Suprabhata Seva Timings

 తిరుమల సుప్రభాత సేవ ఉదయం 3:00 గంటలకు మొదలయ్యి 3:30 గంటల వరకు ఉంటుంది. తర్వాత దర్శనం చేసుకునే సరికి సమయం 4:15 గంటలు అవుతుంది.