Menu
Story Of Anjanadri Hills, Tirumala

అంజనాద్రి కొండ చరిత్ర Story Of Anjanadri Hills

అసురుల రాజు అయిన కేసరి చాలా సంవత్సరాలు ఎప్పటికి మరణం లేని కొడుకు పుట్టాలి అని జపం చేశారు. శివుడు అప్పుడు ప్రత్యక్షమై నీకు అమరుడైన కొడుకు పుట్టే అదృష్టం లేదు కానీ ఆ కోరిక నీ కూతురు ద్వారా తీరుతుంది అని చెప్తారు.  కేసరి కూతురు అయిన అంజనీ దేవి చాలా సంవత్సరాలు కొడుకు కోసం జపం చేయగా ఆంజనేయ స్వామి కొడుకు గా పుట్టాడు. ఆంజనేయ స్వామి శివుని మరో రూపం. హనుమంతుడు అమరత్వ వరం ఆయన తల్లి మహాలక్ష్మి దేవి నుంచే పొందారు. ఆ తర్వాత బ్రహ్మ దేవుడు అంజనీ దేవి పేరు మీద ఆ కొండ కు అంజనాద్రి కొండ అని పేరు పెట్టారు.  

వాయు దేవుడు అంజనా దేవి కి ఒక పండు ని ఇచ్చారు. ఆ పండు తిన్న తర్వాత అంజనా దేవి హనుమంతునికి జన్మ ఇచ్చింది అని చెబుతారు. మరియు అంజనా దేవి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ కొండ కి అంజనాద్రి కొండ అని పేరు వచ్చింది.  

అంజనాద్రి కొండ దగ్గర మీరు స్వామి పుష్కరిణి అనే పవిత్ర జల తీర్థాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆకాశ గంగ అనే పవిత్ర జలపాతం కూడా ఉంటుంది. 

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఒక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని బేడి  ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న వీధికి నేరుగా ఈ  ఆలయం కనిపిస్తుంది. భూ వరాహ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు తర్వాత తిరుమలలో ఈ ప్రాచీన ఆలయానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజు నైవేద్యం పూర్తి అవ్వగానే ఈ ఆలయంలో తీసుకొచ్చి ఉంచుతారు. 

శ్రీరాముడు మరియు హనుమంతుడు మొదటి సారి కలిసిన ప్రదేశం ఇదే అని చరిత్ర చెబుతోంది.  హనుమంతుని తల్లి  అతని అల్లరిని చూసి సంకెళ్ళలో బంధించారు అని చెప్తారు. ఆయనని ఒక ఆరాధ్య దైవంగా విశిష్టాద్వైతులు ఆయన్ని పెరియత్తిరువది మరియు ఔత్తరాహులు పౌరుషావతారా మూర్తి గా పూజిస్తారు. 

హనుమంతుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒంటె కోసం తిరుమల కొండ ని వదిలి వెళ్ళాలి అనుకునేవాడని అందుకే అతని తల్లి అంజనాదేవి ఆంజనేయ స్వామి రెండు చేతుల్ని సంకెళ్లతో బంధించి తాను తిరిగి వచ్చే వరకు హనుమంతుడు అక్కడే ఉండాలని  ఆదేశించారు. ఇప్పటికీ  మహాద్వారం ఎదురుగా హనుమంతుడు నుంచుని ఉండటం చూడవచ్చు.   

తిరుమలకు  వచ్చిన భక్తులు ఈ ఆలయానికి కూడా వచ్చి దర్శించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మహాద్వారం నుంచి అత్యంత సమీపంలో  అఖిలాండం పక్కన  ఉంది ఈ ఆలయం. 

ఈ ఆలయం ప్రతి రోజు  ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం అభిషేకం మరియు హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ  ఆలయంలో ఉచిత దర్శనం మరియు రూ. 300 ల ప్రత్యేక దర్శనం కూడా చేసుకోవచ్చు..