Menu
Srinivasa Divyanugraha Homam in Tirumala Tirupati Devasthanam

శ్రీ  శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది తిరుమల లోని సేవలలో ఒకటి. ఈ హోమం భక్తుల శ్రేయస్సు కొరకు అంకురార్పణ చేశారు. ఈ  హోమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ శ్రీనివాసుని ఆశీర్వాదం భక్తులకు అందేలా ఈ పవిత్ర సమర్పణ ను అమలు చేశారు. ఈ హోమం నవంబర్ 2023 లో కార్తీక మాసంలో  ఉత్థాన ఏకాదశి రోజు  శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ప్రారంభించబడింది. 

ఈ హోమాన్ని వేంకటేశ్వరుని పాద పద్మాల వద్ద భక్తులు నేరుగా ఆశీర్వాదాలను అందుకునేలా ఏర్పాటు చేశారు. హోమం ప్రక్రియ లో విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం,  సద్యోంకురార్పణ తో పాటు రక్షా సూత్రం/ దీక్షా కంకణం వంటివి ఉంటాయి. 

ఈ హోమం అలిపిరి లో శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ శాలలో రోజూ హోమాన్ని  నిర్వహిస్తున్నారు. ఈ హోమం రోజూ ఉదయం 9 గం. నుంచి 11 గంటల మధ్య జరుగుతుంది. ఈ హోమం టిక్కెట్లు ఆన్లైన్ మరియు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు ఆన్లైన్ లో 150 మరియు ఆఫ్లైన్లో 50 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ హోమం లో పాల్గొనేవారు రూ. 300 ల ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం బుకింగ్ ప్రక్రియ