Menu
Sri Bedi Anjaneya Swamy Temple Details

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం,  భూ వరాహ స్వామి ఆలయం తర్వాత అంతే ప్రాముఖ్యత చెందిన ఆలయమే ఈ బేడి ఆంజనేయ స్వామి ఆలయం. శ్రీనివాస ఆలయంలో నైవేద్యం పూర్తి అవ్వగానే ఆ నైవేద్యాన్ని ఇక్కడికే తీసుకొచ్చి సమర్పిస్తారు. శ్రీ రాముల వారు మరియు ఆంజనేయ స్వామి మొదటి సారి ఇక్కడే కలుసుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి. 

ఆంజనేయ స్వామి అల్లరి ఎక్కువగా చేస్తున్నారు అని ఆయన తల్లి అంజనా దేవి ఆయన్ని సంకెళ్లతో ఇక్కడే బందించారని ఆవిడ వచ్చేవరకు ఆంజనేయ స్వామి అక్కడే ఉండాలి అని ఆదేశించారు అని చరిత్ర చెబుతోంది. అందుకే ఇప్పటికీ మహాద్వారం దగ్గర స్వామి నిల్చుని ఎదురు చూస్తున్న విగ్రహం చూడచ్చు.  అంజనా దేవి ఆకాశ గంగ దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్నారు కానీ మళ్ళీ తిరిగి ఇటు వైపు ఎప్పుడు రాలేదు. 

వైష్ణవ ఆచారం ప్రకారం ఆంజనేయ స్వామి లేదా గరుడ విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి సూటిగా ప్రతిష్టించారు. గరుడ శ్రీ మహా విష్ణువు భక్తుడు అలాగే ఆంజనేయ స్వామి శ్రీ రాముడికి భక్తుడు. ఈ నేపథ్యం లో నే ఇక్కడ శ్రీ బేడీ ఆంజనేయ స్వామి తిరుమల ఆలయానికి ఎదురుగా నిల్చుని ఉంటారు. 

ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. ఇక్కడ హనుమాన్ జయంతి పండుగ ను ఘనంగా జరిపిస్తారు. 

ఆలయానికి చేరుకునే మార్గాలు 

అఖిలాండం కి  పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ మహాద్వారం నుండి చేరువలో ఉంది ఈ ఆలయం. 

రైలు మార్గం

ఈ ఆలయం తిరుమల రైల్వే స్టేషన్ నుంచి 1. 5 KM దూరంలో ఉంది ఈ ఆలయం. తిరుపతి రైల్వే స్టేషన్ కి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి రైల్వే స్టేషన్ ల నుంచి డైరెక్ట్ ట్రైన్ లు తిరుపతి కి అందుబాటులో ఉన్నాయి.   

బస్సు  మార్గం 

ఈ ఆలయం తిరుమల బస్సు స్టాండ్ నుంచి కేవలం 1 KM దూరంలో ఉంది. తిరుపతి బస్సు స్టాండ్ కి అన్ని పాపులర్ లొకేషన్స్ నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై ఇంకా బెంగళూరు నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ బస్సు తిరుపతి కి ఉన్నాయి. లేదా ప్రైవేటు బస్సు లు అన్ని చోట్ల నుంచి తిరుపతి కి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. 

శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం సమయాలు

ఈ ఆలయంలో బేడి ఆంజనేయ స్వామిని  ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం మరియు హనుమాన్ జయంతి నాడు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అలాంటి సమయంలో ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.