తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక దర్శనం వర్గం కింద 20% శాతంతో టిక్కెట్లను విడుదల చేశారు. ఈ టిక్కెట్లు వృద్ధులు మరియు స్పెషల్లీ ఏబిల్డ్ పర్సన్స్ తీసుకునే ఏర్పాటు చేశారు. ఈ టిక్కెట్టు తీసుకున్న వారిని ప్రత్యేక మార్గం లో శ్రీనివాసుని దర్శనానికి తీసుకువెళతారు. వృద్దులకు మరియు స్పెషల్లీ ఏబిల్డ్ భక్తులకు క్యూ లైన్ లతో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని మరియు ఎక్కువ సేపు ఉండలేరు అని టీటీడీ వారు ఇలా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఈ ప్రత్యేక ప్రవేశ టిక్కెట్టు ను ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.
సీనియర్ సిటిజన్ లేదా స్పెషల్లీ ఏబిల్డ్ సిటిజన్ దర్శనం రిపోర్టింగ్ సమయం Senior Citizen/Specially Abled Citizen Darshan Reporting Time
ఈ టిక్కెట్టు తీసుకున్న వైకల్యం ఉన్న యాత్రికులు మధ్యాహ్నం 1:00 గంటకు సుపాదం ఎంట్రన్స్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దర్శనానికి వారిని 3:00 గంటలకు పంపిస్తారు.
సీనియర్ సిటిజన్ లేదా స్పెషల్లీ ఏబిల్డ్ సిటిజన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా Senior Citizen/Specially Abled Citizen Eligibility Criteria
ఈ టిక్కెట్టు తీసుకునే వైకల్యం ఉన్న వారికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది.
ఈ టిక్కెట్టు తీసుకునే వృద్ధులకు కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది.
టికెట్ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ Senior Citizen/Specially Abled Citizen Darshan Ticket Online Booking Procedure
ఈ దర్శనం టిక్కెట్టు కోసం ఆన్లైన్ లో టీటీడీ వెబ్ సైట్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
తిరుమల సీనియర్ సిటిజన్ లేదా స్పెషల్లీ ఏబిల్డ్ సిటిజన్ దర్శనం కోట విడుదల తేదీ TTD Senior Citizen/Specially Abled Person Darshan Quota Release Date
తిరుమల లో సీనియర్ సిటిజన్ లేదా స్పెషల్లీ ఏబిల్డ్ సిటిజన్ దర్శనం టిక్కెట్ల కోటా రెండు లేదా మూడు నెలల ముందే విడుదల అవుతాయి. అంటే ఆగస్టు నెల దర్శనం టికెట్లు మే నెలలో విడుదల అయ్యాయి. అలాగే జూన్ నెలలో సెప్టెంబర్ నెల యొక్క దర్శనం టికెట్లు విడుదల అవుతాయి.