తిరుమల సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఏంటి? What Does Seva Electronic DIP Tirumala Mean?
తిరుమల లో ప్రతి రోజు ఎలక్ట్రానిక్ డిప్ తీస్తారు. టీటీడీ లక్కీ డిప్ ద్వారా భక్తులకు తిరుమలలో జరిగే తోమాలసేవ, సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం, అష్ట దళ పద్మారాధనము వంటి సేవలలో పాల్గొనే అవకాశం ఇచ్చే లక్కీ ఛాన్స్. ఈ సేవలలో బుకింగ్ చాలా వేగంగా అయిపోతుంది. అందువల్ల జనరల్ కోట లో టిక్కెట్లు బుక్ చేసుకోలేని భక్తులకు సేవలు చూడటం కష్టంగా మారింది. వారికి ఆ అవకాశం కల్పించేలా ఈ లక్కీ డిప్ సిస్టం ను విడుదల చేసారు.
లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? When will Lucky Dip Registration Open?
ఈ లక్కీ డిప్ కి ప్రతి సేవా తేదీకి మూడు నెలల ముందు తెరవబడుతుంది. 3 నెలల తర్వాత ఒక నెలకు సేవను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. టీటీడీ వెబ్ సైట్ లో సేవ కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ రిజిస్టరేషన్ 5 రోజుల వరకు ఉంటుంది 5 రోజుల తర్వాత మూసివేయబడుతుంది.
లక్కీ డిప్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి? When Will Lucky Dip Results Release?
రిజిస్టరేషన్ క్లోజ్ అవ్వగానే డిప్ అమలు అవుతుంది. ఈ డిప్ రిజల్ట్స్ ప్రతి సారి ఓపెన్ ఐన రోజు నుంచి నాల్గవ రోజున రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత విడుదల అవుతాయి. డిప్ లో సేవకు సెలెక్ట్ ఐన భక్తులు మూడు రోజుల్లో పేమెంట్ ని పూర్తి చేయాలి.
ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ Electronic Dip Registration Procedure