తిరుమల లో జరిగే పవిత్ర సేవలలో సహస్ర కలశాభిషేకం సేవ ఒకటి. ఈ సేవ మూల విరాట్టు కి ప్రతిరూపం అయిన శ్రీ భోగ శ్రీనివాస మూర్తి మరియు ఉత్సవ విగ్రహాలు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అంకితం చేయబడింది. బంగారు వాకిలి దగ్గర ఉదయం రెండవ గంట మోగిన తర్వాత ఈ సేవ జరుగుతుంది.
భోగ శ్రీనివాస మూర్తి గోల్డెన్ ఎంట్రన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక దారంతో గర్భ గుడి లో ఉన్న మూలవిరాట్టు కు కలుపుతారు. దారానికి ఒక చివరని భోగ శ్రీనివాస మూర్తి పాదాలకు చుడతారు, మరొక చివరినికి మూల విరాట్ కథితాస్త కు జోడిస్తారు. మూల విరాట్టుకు శ్రీ భోగ శ్రీనివాస మూర్తి కి బంధాన్ని సృష్టిస్తుంది.
శ్రీ మలయప్ప స్వామి వారు భూదేవి, శ్రీదేవి సమేతంగా గర్భ గుడి నుంచి తీసుకొచ్చి బంగారు వాకిలి బయట ఉంచుతారు. అలాగే విశ్వక్సేనుని విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఉంచుతారు. 1008 వెండి కళాశాలలో ఉన్న అభిషేక తీర్థం లేదా పరిమళ తీర్థం తో పంచ శాంతి మంత్రాలు జపిస్తూ అభిషేకం చేస్తారు. ఈ పరిమళ తీర్థం చందనపు ముద్దా మరియు నీటోతో తయారు చేస్తారు. ఈ వెండి కళాశాలతో పాటు ఒక బంగారు కలశంలో నీటిని ఉంచుతారు.
ఈ సేవలో పాల్గోవాలి అనుకునే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ I దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ సేవ ఉదయం 6:00 గంటల నుంచి 8:00 గంటల వరకు జరుగుతుంది. భక్తులు ఉదయం 5:00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ I దగ్గర రిపోర్ట్ చేయాలి.
సహస్ర కలశాభిషేకం సేవ టికెట్ బుకింగ్ ప్రక్రియ
సహస్ర కలశాభిషేకం సేవ కు 25 టిక్కెట్లను ఆన్లైన్ బుకింగ్ కి విడుదల చేస్తారు.
ప్రతి బుధవారం జరుపుతారు. ఈ సేవ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
ఈ టిక్కెట్టు ధర రూ.850 మరియు ఒక టిక్కెట్టుకు ఒకరిని అనుమతిస్తారు. ఒక లాగిన్ ID తో 6 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్టు కి 1 లడ్డు, 2 అప్పాలు, 1 వడ, పులిహార, పొంగల్, పాయసం తో పాటు పురుషులకు ఉత్తరీయం మరియు స్త్రీలకు జాకెట్టు ముక్క ప్రసాదంగా ఇస్తారు. ఈ సేవ ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.