సహస్ర దీపాలంకరణ సేవ తిరుమల శ్రీవారి ఆలయానికి వెలుపల ఊంజల్ మండపంలో ప్రతి రోజు జరుగుతుంది. ఈ సేవ భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈ సేవ ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటలకు జరుగుతుంది. ఈ సేవలో 1000 దీపాలు వెలిగించే అలంకరణ ఆ దీపాల వెలుగు తో ప్రకాశవంతమైన ఒక ప్రత్యేక ఆకర్షణను కల్పిస్తుంది.
ఈ సేవ లో శ్రీ మలయప్ప స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగింపుకు తీసుకువెళతారు. స్వామి వారు దీపాల మధ్యలో ఊయలలో కూచుంటారు. అన్నమయ్య సంకీర్తనలు మరియు వేద శ్లోకాలు కొత్తగా పెళ్లయిన దేవుడు మరియు దేవతల ముందు ఆలపించటంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది.
దేవతా మూర్తులను సేవ తర్వాత ఆలయం లోపలి తీసుకువెళ్లే ముందు ఊరేగింపుగా ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు వరకు ఊరేగిస్తారు.
సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్టు ధర, రిపోర్టింగ్ ప్లేస్ మరియు సమయం
- ఈ సహస్ర దీపాలంకరణ సేవ ఒక టిక్కెట్టు ధర రూ. 200 మరియు ఒక టిక్కెట్టు కు ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్టు అవసరం లేదు.
- ఈ సేవ సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు కొనసాగుతుంది.
- ఈ సేవ లో పాల్గొనే వారు సుపదం దగ్గర ఒక గంట ముందు అంటే సాయంత్రం 4:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ
- టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి “ఆర్జిత సేవ” ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి
- అందులో “సహస్ర దీపాలంకరణ సేవ” అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి
- ఆ తర్వాత మీకు క్యాలెండరు లో కనిపించే డేట్స్ లో గ్రీన్ కలర్ లో డేట్స్ ఉన్నాయా లేదా అని అవైలబిలిటీ ని చెక్ చేసుకోవాలి
- అవైలబుల్ లో ఉన్న డేట్స్ లో మీరు సేవ జరిపించుకోవాలి అనుకున్న డేట్ ను ఎంచుకుని కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
- మీరు ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నారో నెంబర్ ని ఎంటర్ చేసి మీ పేరు, వయస్సు, ఫోటో ID ప్రూఫ్ , మెయిల్ id , మొబైల్ నెంబర్ మరియు ID కార్డు నెంబర్ వంటి వివరాలు పూర్తి చేయండి.
- మీ వివరాలను చెక్ చేసుకుని పేమెంట్ మెథడ్ ను సెలెక్ట్ చేసుకోండి.
- “Pay Now” బటన్ పై క్లిక్ చేసి పేమెంట్ ని పూర్తి చేయండి.