Menu
Rs.300 Special Darshan Ticket, Tiruchanur

Title - Sri Padmavathi Ammavari Temple Special Darshan Tickets - Booking, Price, Timings 

 తిరుమల శ్రీ  వెంకటేశ్వర స్వామి భార్య అయిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు లో ఉంది. ఇక్కడ ఆలయం దర్శించుకున్న వారు అందరూ అమ్మవారి ఆలయం కూడా దర్శించుకుంటారు. అలా వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువ అవడం వలన టీటీడీ వారు శీఘ్ర దర్శనం టిక్కెట్టు విడుదల చేశారు. దాని ధర కేవలం రూ. 300 మాత్రమే.  ఈ ఆలయం తిరుమల ఆలయం నుండి సుమారు 27 KM ల దూరం లో ఉంటుంది. 

 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమయం - Sri Padmavathi Ammavari Temple Timings

ఈ ఆలయంలో అమ్మవారు  ప్రతి రోజు ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు  దర్శనమిస్తారు. ఈ ఆలయం రాత్రి 11:00 గంటలకు మూసివేయబడుతుంది.  

ఇక్కడ ఉదయం ఆరతి 6:00 గంటల నుండి 7:00 గంటల వరకు, సాయంత్రం ఆరతి 6:00 గంటల నుండి 7:00 గంటల వరకు జరుపుతారు. అలాగే ఇక్కడ కుంకుమ అర్చన కూడా జరుపుతారు. అది మధ్యాహ్నం 12:30 గంటల నుండి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటుంది.  సర్వ దర్శనం ఉదయం 5:25 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు ఉంటుంది. 

పద్మావతి ఆలయం శీఘ్ర దర్శనం టికెట్ బుకింగ్ ప్రక్రియ - Sri Padmavathi Devi Temple Special Entry Darshan Ticket Booking Procedure

  1. ముందుగా టీటీడీ సైట్ లోకి వెళ్లి స్పెషల్ దర్శనం టికెట్ అమ్మవారి ఆలయం ను సెలెక్ట్ చేసుకోవాలి 
  2. అది సెలెక్ట్ చేయగానే మీకు కేలండర్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేట్ అవైలబిలిటీ చూసుకోవచ్చు.

Choosing date in calendar - Step 2 in Special Darshan ticket booking, Tiruchanur 

3.గ్రీన్ కలర్ లో ఉన్న అవైలబుల్ డేట్ చూసుకుని మీకు కావాల్సిన డేట్ ను సెలెక్ట్ చేసుకోండి 

4. దాని తర్వాత మీకు ఎన్ని ఎక్స్ట్రా లడ్డూలు కావాలో చూసే చేసుకోండి. ఒక ఎక్స్ట్రా లడ్డు రూ. 25

Choosing Number of Laddus- Step 4 in Special Darshan Ticket booking procedure Tiruchanur

5.దర్శనం టికెట్ ధర రూ. 200 మరియు మీరు ఎంచుకున్న లడ్డు ని బట్టి ఆ ధర కలిపి అమౌంట్ చూపిస్తుంది. అక్కడ మీరు మీ పూర్తి వివరాలు ఇవ్వాల్సి  ఉంటుంది. 

Checking final amount & entering details - Step 5 in special darshan booking, Tiruchanur

6. మీ వివరాలు ఇచ్చి “continue” బటన్ నొక్కగానే మీకు పేమెంట్ పేజీ వస్తుంది. మీరు ఏ విధమైన పేమెంట్ చేయాలి అనుకున్నారో సెలెక్ట్ చేసి పే చేస్తే మీకు టికెట్ రిసిప్ట్ వస్తుంది.

Amount Payment - Step 6 in Special Darshan booking Tiruchanur 

ఇలా మీరు పద్మావతి అమ్మవారి ఆలయ శీఘ్ర దర్శనం టిక్కెట్టు తీసుకోవచ్చు. ఇంకా మీకు కావలసినట్టుగా ఏ సేవ కావాలి అన్న బుక్ చేసుకోవచ్చు.
   
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రత్యేక దర్శనం టిక్కెట్టు విడుదల తేదీ - Sri Padmavathi Ammavari Temple Special Darshan Ticket Release Date

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం లో జూన్ నెలలో ప్రత్యేక దర్శనం టికెట్లు ఏప్రిల్ 24, 2024 న విడుదల అయ్యాయి. ఇప్పుడు టీటీడీ వెబ్ సైట్ లో పద్మావతి అమ్మవారి స్పెషల్ దర్శనం టిక్కెట్టు ఆప్షన్ లోకి వెళ్లి క్యాలెండర్ లో జూన్ నెలలో ఉన్న అవైలబుల్ డేట్స్ చూసుకుని దర్శనం టిక్కెట్టు బుక్ చేసుకోవచ్చు. 

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సేవలు - Different Sevas In Padmavathi Ammavari Temple

ఇంకా ఈ ఆలయంలో సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, పద్మావతి పరిణయం, ఏకాంత సేవ, వేద ఆశీర్వచనం మరియు ఊంజల్ సేవ వంటివి జరుపుతారు.  ఇవే కాక అభిషేకం, వస్త్రాలంకరణ సేవ వంటివి కూడా ఉన్నాయి.  ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారి గుడిలో అందుబాటులో ఉన్న సేవలను పైన చెప్పిన విధంగా బుక్ చేసుకోవచ్చు. ఆ సేవల యొక్క ధరల వివరాలు క్రింద ఇచ్చాము.