Menu
Rs.300 Special Darshan ticket in Tirumala

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుకింగ్, ధర, రిలీజ్ డేట్ వివరాలు    - Tirumala Special Entry Darshan Ticket - Booking, Price, Release Date

తిరుమల లో ప్రతి రోజు సుమారు 2-3 లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అందుకే టీటీడీ వారు వెయిటింగ్ టైం పెరగకుండా దర్శనానికి ఆలస్యం అవ్వకుండా వివిధ రకాల ఏర్పాట్లు చేశారు. అందులో  ప్రత్యేక దర్శనం ఒకటి. దీని వల్ల భక్తులు కేవలం సర్వ దర్శనం క్యూ లో నే కాక ప్రత్యేక ప్రవేశ దర్శనం మార్గంలో వెళ్లేలా ఏర్పాటు చేసి తద్వారా క్యూ లైన్ ల రద్దీ తగ్గేలా చేశారు. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే ఏంటి, ఈ టిక్కెట్టు ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఈ టిక్కెట్టు ధర ఎంత, ఈ టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు వంటి వివరాలు అన్నీ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.  

తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్టు అంటే ఏమిటి? - What is the Tirumala Special Entry Darshan Ticket?

తిరుమల లో  శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల క్యూ లైన్ లో రద్దీ పెరిగింది. అందువల్ల వెయిటింగ్ టైం కూడా పెరిగింది. ఈ వెయిటింగ్ టైం తగ్గించి భక్తులు దర్శనం చేసుకునేల ఈ స్పెషల్ దర్శనం  టీటీడీ వారు ఏర్పాటు చేశారు. ఈ శీఘ్ర దర్శనం 21-sep-2009 లో ప్రవేశ పెట్టారు. ఈ టిక్కెట్టు ధర కేవలం రూ. 300 మాత్రమే. ఇంక ఈ టిక్కెట్టు తో ఒక లడ్డూ ప్రసాదం  ఉచితంగా  తీసుకోవచ్చు.  ఒక శీఘ్ర దర్శనం టిక్కెట్టుకు ఒకరికి మాత్రమే దర్శనం ఉంటుంది.

తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్టు ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ - Tirumala Special Entry Darshan Ticket Online Booking Procedure

తిరుమల శీఘ్ర దర్శనం టికెట్లు  60 రోజుల ముందు రిలీజ్ అవుతాయి. అంటే రెండు నెలల ముందు బుకింగ్ చేసుకోవచ్చు. అంటే ఆగస్టు నెలలో దర్శనం టికెట్లు మే నెలలో విడుదల అయ్యాయి, అలాగే సెప్టెంబర్ నెలలో బుక్ చేసుకునే దర్శనం టికెట్లు 60 రోజుల ముందు అంటే జూన్ నెలలో విడుదల అవుతాయి.  ఇప్పుడు మనం తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.

  1. టీటీడీ అధికారిక సైట్ లో స్పెషల్ దర్శనం టిక్కెట్టు ను సెలెక్ట్ చేసుకోవాలి.
  2. తర్వాత మీకు ఒక క్యాలెండర్ కనిపిస్తుంది. 
  3. ఆ క్యాలెండర్ లో డేట్  గ్రీన్ కలర్ లో ఉంటే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు(రెడ్ కలర్ లో ఉంటే టిక్కెట్లు అయిపోయినట్టు, ఎల్లో ఉంటే స్లాట్  పూర్తి అయిపో వచ్చినట్టు, బ్లూ ఉంటే స్లాట్ ఇంకా రిలీజ్ కానట్టు, గ్రే ఉంటే  స్లాట్ లేనట్టు ).
  4. మీకు కావాల్సిన తారీకు ఎంపిక  చేసుకుని, ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారో సంఖ్యను నమోదు చేయండి.  ఒక  లాగిన్ ID తో 6 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
  5. తర్వాత మీ పూర్తి వివరాలు ఇచ్చి పేమెంట్ ను పూర్తి  చేయండి.
  6. పేమెంట్ పూర్తి కాగానే మీకు ఒక రిసిప్ట్ వస్తుంది.

తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్టు ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ - Tirumala Special Entry Darshan Ticket Offline Booking Procedure

తిరుమల శీఘ్ర దర్శనం టిక్కెట్లు ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే, తిరుపతి APSRTC బస్సు స్టాండ్ కు దగ్గర లో ఉన్న  శ్రీనివాసం కాంప్లెక్స్ లో రూ. 300 ల టిక్కెట్టు అదే రోజు తీసుకోవచ్చు. అయితే మీరు లైన్ లో ఎంత ముందు నుంచుంటే అంత కచ్చితంగా, త్వరగా  మీకు టిక్కెట్టు వస్తుంది.

గమనిక: ఈ ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ రోజు మారుతూ ఉంటుంది. పైన చెప్పిన ప్రక్రియ అంతకుముందు అమలు చేసింది. 155257 నెంబర్ కు కాల్ చేసి ఆఫ్లైన్ రూ. 300 టిక్కెట్ల గురించి సరైన సమాచారం తెలుసుకోగలరు.

తిరుమల ప్రత్యేక దర్శనం సమయం - Tirumala Special Entry Darshan Timings

తిరుమలలోని ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా రూ. 300 ల దర్శనం ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 11 :00 గంటల వరకు ఉంటుంది.

తిరుమల ప్రత్యేక దర్శనం ఎంట్రీ వయోపరిమితి - Tirumala Special Entry Darshan Age Limit

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం తీసుకునే భక్తులలో చిన్న పిల్లలకు వయస్సు పరిమితి ఉంది. 12 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు దర్శనం టిక్కెట్టు తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్టు అవసరం లేదు.

తిరుమలలో పిల్లలకు ప్రత్యేక దర్శనం - Special Entry Darshan For Child At Tirumala

పిల్లలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించటం కోసం టీటీడీ వారు సుపదం ఎంట్రన్స్ నుంచి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ  దర్శనం మార్గాన్ని మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పొందవచ్చు. 
  
తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్టు విడుదల తేదీ - Tirumala Special Entry Darshan Ticket Release Date

తిరుమలలోని ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు రెండు నెలలకు ముందు రిలీజ్ అవుతాయి. అలాగే మే నెలలో ఆగస్టు నెల దర్శనం టికెట్లు విడుదల అయ్యాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల దర్శనం టికెట్లు జూన్ నెలలో విడుదల అవుతాయి.