Menu
Papavinasanam Teertham Tirumala

తిరుమల లో కచ్చితంగా చూడాల్సిన పవిత్ర ప్రదేశాలలో పాపవినాశనం ఒకటి.  స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు అందరూ ఈ తీర్థాన్ని కూడా దర్శించుకుంటారు. దీన్ని పాపవినాశనం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ పవిత్ర జలం భక్తులకు  పాపాలని పోగొట్టి ఆధ్యాత్మిక విముక్తిని అందిస్తుంది అని నమ్ముతారు. 

పాపవినాశనం తీర్థం స్వామి వారి ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కచ్చితంగా ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేస్తారు. ఆలయం నుంచి కొంత దూరం కొండ పైకి ఎక్కాల్సి ఉంటుంది. 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ తీర్థాన్ని సృష్టించారు అని చరిత్ర చెబుతోంది.  స్వామి వారు భూలోకానికి వచ్చినప్పుడు భక్తుల పాపాలు పెరిగిపోతున్నాయి అని భావించి వారిని కాపాడాలి అని వారి పాపాలను తగ్గించాలి అని ఈ తీర్థాన్ని సృష్టించారని చెప్తారు.  

దీనికి  తొలగించే శక్తి తో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యం చేసే శక్తులు ఉన్నాయని నమ్ముతారు.  భక్తులు పుణ్య స్నానం ఆచరించి ఆ పవిత్ర తీర్థాన్ని  వారితో పాటు తీసుకెళ్తారు.  దీనికి ఆరోగ్య సమస్యలు తొలగించే శక్తి  ఉంది. 

పాపవినాశనం తీర్థం సమయం 

పాపవినాశనం తీర్థం ఉదయం నుంచి వెలుగు ఉన్న సమయం లోనే ఓపెన్ లో ఉంటుంది. అంటే ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది. 

పాపవినాశనం తీర్థం చేరుకునే విధానం

పాపవినాశనం తీర్ధం ఆకాశ గంగ కు వెళ్లే మార్గంలో ఉంటుంది. తిరుమల CRO ఆఫీస్ నుంచి బస్సు లో పాపవినాశనం చేరుకోవడం సులువు అని చెప్పవచ్చు.. అక్కడ నుంచి పాప వినాశనానికి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. 

ఆకాశ గంగ తీర్థానికి ఒక టిక్కెట్టు తీసుకుని, ఆకాశ గంగ చేరే వరకు ఆ దారిలో ఉన్న తీర్థాలు అన్నిటికి అదే టిక్కెట్టు తో వెళ్లి రావచ్చు.. మళ్ళీ అదే టిక్కెట్టు తో తిరుమల CRO ఆఫీస్ దగ్గర దిగవచ్చు.. 

తిరుమల బస్సు స్టాండ్ నుంచి పాపవినాశనం కి టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.  పాపవినాశనం తీర్థం దగ్గర సీటింగ్ ఏరియాస్, చేంజింగ్ రూమ్స్, స్నానానికి ప్రత్యేక ఘాట్స్ వంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు.