కల్యాణోత్సవం సేవ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఒక పవిత్ర సేవ. ఈ కల్యాణోత్సవం సేవ ప్రతి రోజు జరిగే ఒక ప్రాముఖ్యమైన మరియు శుభప్రదమైన సేవ. ఈ సేవ లో శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు పద్మావతి దేవి కి కళ్యాణం జరిపించటం ఆచారం. ఈ సేవ స్వామి వారు మరియు అమ్మవారి కలయికకు ప్రతీక. ఈ సేవ వల్ల భక్తులకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి అని ప్రతీక. స్వామి వారిని పట్టు వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరించి స్వామి వారిని అమ్మవారిని పూజించి ఈ సేవను మొదలుపెడతారు.
ఈ కళ్యాణోత్సవ సేవ క్రీ. శ 1536 లో మొదలైయింది. తాళ్ళపాకం తిరుమల అయ్యంగార్ గారికి శ్రీ మలయప్ప స్వామి వారి వివాహ వేడుకను జరపాలి అని ఆలోచన వచ్చి 5 రోజుల పాటు ఆలయంలో ఉన్న తిరుమామణి మండపంలో జరిపించారు. అప్పటి నుంచి ఈ ఆచారం మొదలయ్యింది.
కల్యాణోత్సవం సేవ ఆలయ ప్రధాన గర్భ గుడిలో అర్చకులు మరియు భక్తుల నడుమ జరుగుతుంది. ఈ సేవ లో ప్రధాన అంశం ‘మంగళస్నానం’ . శ్రీవారి కల్యాణోత్సవం శ్రీ మలయప్ప స్వామి మరియు ఆయన భార్యలు శ్రీదేవి, భూదేవి కి అంకితం చేయబడింది. ఆలయ పురోహితులు ఈ సేవను నిర్వహిస్తారు మరియు వరుడి తరపున చేయాల్సిన ఆచారాలను నిర్వహించడానికి ఒక అర్చకుడు పవిత్రం చేయబడతాడు. ఈ కల్యాణోత్సవం వైఖానస ఆగమ ఆచారాలను అనుసరించి పంచమూర్తి పూజ తో ప్రారంభమవుతుంది. ఈ సేవ పూర్తి కావడానికి గంట సమయం పడుతుంది.
కల్యాణోత్సవం కొత్తగా పెళ్ళయిన జంటలు చేయించుకున్న వారు అన్యోన్యంగా ఉంటారని నమ్ముతారు. ప్రతి రోజు తిరుమల CRO ఆఫీస్ లో ఈ టిక్కెట్లను 20 కొత్త జంటలకు జారీ చేస్తారు. ఈ టిక్కెట్లను ఒక రోజు ముందుగా తిరుమలలో తీసుకోవాలి. ఈ టికెట్ కౌంటర్ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ సేవ చేయించుకోవాలి అనుకునే కొత్త జంట వారి ఆధార్ కార్డు, శుభలేఖ మరియు పెళ్లి ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ సేవ టిక్కెట్లను పెళ్ళి అయిన తేదీ నుండి వారం రోజులు లోపు మాత్రమే పొందగలరు.
కల్యాణోత్సవం సేవ టిక్కెట్టు ధర
కల్యాణోత్సవం సేవ కు ఒక టిక్కెట్టు ధర రూ. 1000. ఒక టిక్కెట్టుకు ఇద్దరిని అనుమతిస్తారు. ఆ ఇద్దరితో పాటు 12 ఏళ్ల లోపు పిల్లలను కూడా అనుమతిస్తారు. ఒక లాగిన్ id తో ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు.
కల్యాణోత్సవం సేవ రిపోర్టింగ్ సమయం మరియు ప్లేస్
ఈ సేవ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుంది. ఈ సేవ లో పాల్గొనే భక్తులు ఉదయం 9:30 గంటలకు సుపథం దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సేవకు వెళ్లే ముందు మీ సేవ టిక్కెట్టు ఫోటోస్టాట్ కాపీ మరియు మీ ఒరిజినల్ ID ప్రూఫ్ తీసుకువెళ్లాలి.
కల్యాణోత్సవం టిక్కెట్లు లభ్యత
కల్యాణోత్సవం టిక్కెట్లు బుకింగ్ ప్రక్రియ
ఈ సేవ లో పాల్గొన్న భక్తులను ఉచితంగా దర్శనానికి తీసుకెళ్తారు. సేవ తర్వాత దర్శనం 15 నిమిషాలలో అవుతుంది. ఈ సేవలో పాల్గొనే వారు పురుషులు అయితే దోతీ ధరించి షర్ట్ తీసేయాలి మరియు స్త్రీలు చీర లేదా పంజాబీ డ్రెస్ దుప్పట్టా తో ధరించాలి.