Menu
Information About Srivari Padalu Tirumala

శ్రీవారి పాదాలు అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర పాద ముద్రలు. తిరుమల ఆలయం తర్వాత అంతే ప్రాముఖ్యత ఉన్నది ఈ శ్రీవారి పాదాలకే.  ఏడు కొండలలో ఎత్తైన కొండ అయిన శేషాచలం కొండల మీద ఉన్న ఈ శ్రీవారి పాదాలు స్వామి వారు తిరుమల కు చేరుకున్నప్పుడు అడుగు పెట్టినప్పుడు పడిన ముద్రలు అని భక్తులు నమ్ముతారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన లక్షల భక్తులు స్వామివారి పాదాల దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. 

సముద్ర మట్టానికి 3,300 అడుగుల ఎత్తు లో ఉన్న ఈ శ్రీవారి పాదాలు తిరుమల లో ఒక ప్రసిద్ధ ప్రదేశం అని చెప్పచు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి కొండ పైకి ఎక్కాల్సి ఉంటుంది. అలా కొండపైకి చేరుకునే సమయంలో అందమైన ప్రకృతి సౌందర్యాలను చూసి ఆనందించచ్చు. 

ఒక రాయి మీద పడిన పాద ముద్రలు శ్రీవారి దివ్య పాద ముద్రలు గా పరిగణిస్తారు. ఈ ముద్రలు స్వామి వారు భూమి పైకి వచ్చారని,  భక్తులను ఆశీర్వదించి కాపాడుతున్నారని ప్రతీక.  

శ్రీవారి పాదాలు 

స్వామి వారు సహజ రూపం లో వచ్చి శేషాచలం కొండ మీదకు వచ్చి ఆశీర్వదించి ఆయన పాదముద్రలు వదిలి వెళ్లారని చరిత్ర చెబుతోంది. ఆ పాద ముద్రలని పవిత్ర చిహ్నం గా, స్వామి వారికి తన భక్తుల మీద ఉన్న ప్రేమ, కరుణ మరియు రక్షించాలని సంకల్పం కి చిహ్నం గా చెప్తారు. 

విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారం గా మారింది ఇక్కడే అని చరిత్ర చెబుతోంది.  వెంకటేశ్వర స్వామి మొదట పాదం మోపింది ఏడు కొండల లో ఒకటి అయిన నారాయణగిరి అని ఆ ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అని వేదాలు, పురాణాలలో ఉంది.  తిరుమల ఆలయం నుంచి కొండ పైకి సుమారు 300 మెట్లు ఎక్కిన తర్వాత ఈ పాదాలను దర్శించుకోవచ్చు. 

శ్రీవారి పాదాలను ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. తిరుమల నుంచి శ్రీవారి పాదాలు సుమారు 6 KM ల దూరం లో ఉంటాయి.  శ్రీవారి పాదాలు శిలా తోరణం నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు..