తిరుమల లో ప్రతి రోజు కొలువు జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం తోమాల సేవ జరిగిన తర్వాత ముందు రోజు ఖాతాలు మూసివేసి స్వామి వారికి సమర్పిస్తారు. ఈ సేవ ను కొలువు లేదా దర్బార్ అని అంటారు. తిరుమల గోల్డెన్ ఎంట్రన్స్, స్నపన మండపం లో ఒక సింహాసనం పైన కొలువు శ్రీనివాసుని ఉంచి ఆ రోజు తిథి, వార, నక్షత్రాలతో పంచాంగ శ్రవణం తో పాటు ముందు రోజు వచ్చిన ఆదాయం మరియు అయిన ఖర్చు స్వామి వారికి వినిపిస్తారు. దానితో పాటు ఆ రోజు ఉత్సవ విశేషాలు, స్వామి వారికి దానం చేసిన దాతల పేర్లు కూడా చదువుతారు. ఈ సేవ ఏకాంతంగా జరుగుతుంది. ఇది అయిన తర్వాత స్వామి వారికి నువ్వుల పిండి, బెల్లం కలిపి చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. ధ్వజారోహణం జరిగిన మొదటి రోజు నుండి గోల్డెన్ ఎంట్రన్స్ ఎదురుగా ఈ కొలువు జరుగుతోంది.
ప్రతి రోజు ఈ సేవ జరుగుతున్నపుడు శ్రీనివాసుడు తమలపాకులు తో బియ్యం మరియు దక్షిణ తాంబూల దానం గా అర్చకులకు ఇస్తారు. ఆ తర్వాత స్వామి వారిని అర్చకులు “నిత్య ఐశ్వర్యో భవ” అని ఆశీర్వదిస్తారు. ఈ సేవ అంతా ఏకాంతంగా జరుగుతుంది.
ఈ కొలువు లో స్వామి వారిని రక రకాల బంగారం, వెండి నగలు, వస్త్రాలు వంటి వాటితో అలంకరించే ఆచారం ఉంటుంది. ఈ సేవ పాలు, పెరుగు, తేనే, చందనం తో అభిషేకం చేసిన తర్వాత జరుగుతుంది. కొలువు జరిపించే పూజారులు అలంకారం చేయడం ట్రయినింగ్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నగలు పెట్టడంలో మరియు వస్త్రాలు అలంకరించడం లో ఒక special technique ఉంటుంది.
ఆ రోజు ఉదయం జరిగే తోమాలసేవ మరియు అభిషేకం తో పాటు ముందు రోజు వచ్చిన డొనేషన్ ని స్వామి వారి దగ్గర చదువుతారు. దాన్నే కొలువు లేదా దర్బార్ అని పిలుస్తారు. మైసూరు మహారాజు కొలువు శ్రీనివాసమూర్తి ని తిరుమామణి మండపానికి తీసుకొచ్చి ఒక వెండి కుచ్చి లో కూర్చోబెడతారు. ఆ మూర్తి పైన ఒక గొడుగు కూడా ఉంటుంది. టీటీడీ మెంబెర్స్ మరియు పూజారులు మాత్రమే ఈ సేవ లో ఉంటారు.
కొలువు సమయంలో జరిగే ఆచారాలు
ప్రతి రోజు కొలువు లో శ్రీనివాసుడు బియ్యం, తమలపాకులు, దక్షిణ పూజారులకు తండుల దానం లాగా ఇస్తారు. ప్రతి రోజు పూజారులు శ్రీనివాసుని నిత్యైశ్వర్యో భవ(Nityaishvaryo Bhava) అని ఆశీర్వదిస్తారు. ఇదంతా ఏకాంతంగా జరుగుతుంది.