Menu
History & Timings Of Swami Pushkarini Tirumala

తిరుమల కొండల మధ్యలో ఉంది ఈ  శ్రీవారి పుష్కరిణి. ఈ పవిత్ర నీటి కొలను తిరుమల ఆలయంలో అంతర్భాగంగా ఉండి లక్షల మంది భక్తులతో నిండుతోంది. ఈ పవిత్ర స్వామి పుష్కరిణి వేంకటాచల కొండ మీద ఆనంద నిలయానికి సమీపంలో ఉంది. స్వామి వారు స్వర్గం నుంచి తన రథం పైకి దిగిన తర్వాత ఇక్కడే స్థిరపడ్డారు అని చెప్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిక్కున ఉంది. 

పుష్కరిణి చరిత్ర
 
ఈ సరస్సు త్రిలోకాలను రూపొందించే 7 సరస్సులలో ఒకటి. పుష్కరిణి తిరుమలకు 10వ శతాబ్దానికి చెందిన గొప్ప చరిత్ర ఉంది. చోళ రాజవంశం పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. 

పుష్కరిణి తిరుమల భక్తులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రధాన ఆలయ సముదాయం లోకి  ప్రవేశించే ముందు సరస్సులోని పవిత్ర జలం లో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు.  పుష్కరిణి 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. 

వామన పురాణం Vamana Purana

ప్రాచీన కాలం లో మార్కండేయ అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన బ్రహ్మ దేవుని వరం అడగడం కోసం జపం చేస్తుండేవారు. బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై తనకి ఏం వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు ముల్లోకాలలో ఉన్న సరస్సులకు వెళ్లేందుకు బలం కావాలి అని కోరుకుంటారు.  

బ్రహ్మ దేవుడు అది కుదరదు అని చెప్పి దానికి బదులుగా “స్వామి పుష్కరిణి” కి వెళ్లి ధనుర్మాసం ద్వాదశి రోజున అక్కడ ఒక్కసారి మునిగితే ని కోరిక తీరినట్టే అని చెప్తారు.  ఆయన చెప్పినట్టే మార్కండేయుడు చేయగా ఆయన కోరిక ఫలించింది. 

వరాహ పురాణం Varaha Purana

ఒకప్పుడు శంఖ అనే రాజు పరిపాలన లో ఉండేవారు.  ఆయన గొప్ప యోధుడు ఇంకా చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తూ పాలన చేసేవారు. ఆయన సంపద ని చూసి అసూయతో ఇతర రాజ్యాల వారు అతని రాజ్యాన్ని పడగొట్టాలి అనుకుంటారు. ఆ వార్త రాజు కి తెలిసి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ రాజ్యం తాను కోల్పోయాడు.  ప్రాణ భయం తో ఆయన గురువు దగ్గరకు చేరుకున్నప్పుడు గురువుగారు “స్వామి పుష్కరిణి” ని దర్శించుకోమని చెప్తారు. అలా దర్శించుకుని స్నానమాచరించిన రాజుకు దేవుడు ప్రత్యక్షమయ్యి రాజు కోల్పోయిన శ్రేయస్సుని, రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు.

స్కంద పురాణం Skanda Purana


చంద్రవంశంలో నందుడు అనే ఒక రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు ధర్మగుప్తుడు. రాజు అతనికి తన రాజ్యాన్ని అప్పగించి అడవికి వెళ్ళిపోయాడు. రాజు అడవికి వెళ్లిన సమయం రాత్రి అవ్వడంతో అతన్ని ఒక సింహం వెంబడించింది. దాని నుంచి రక్షణకి చెట్టు పైకి ఎక్కగా అక్కడ ఒక ఎలుగుబంటి కూడా ఉంటుంది. ఎలుగుబంటి రాజుకి భయపడొద్దు అని, విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తుంది. రాజు ని కాపాడిన ఎలుగుబంటి సింహానికి ఎదురు తిరిగింది కానీ రాజు మాత్రం ఎలుగుబంటిని సింహం మీదకి తోసేస్తాడు. 

అప్పుడు ఎలుగుబంటి రాజుని పిచ్చివాడివి అవుతావు అని శపిస్తుంది. అప్పటి నుంచి రాజుకి మతి స్థిమితం లేకుండా పోయింది. అలా చుసిన కుమారుడు బాధ పడుతుండగా మిధున మహర్షి ఆయన్ని స్వామి పుష్కరిణికి తీసుకొచ్చాడు. అక్కడ స్నానం ఆచరించాక రాజు కి శాపం నుంచి విముక్తి దొరికింది. 

ఇలా అన్ని పురాణాలలోను ఈ పుష్కరిణి కి చరిత్ర, విశిష్టత ఉన్నాయి. పుష్కరిణి తిరుమల భక్తులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రధాన ఆలయ సముదాయం లోకి ప్రవేశించే ముందు ఈ పవిత్ర జలం లో స్నానం ఆచరించడం వలన ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు.    

పుష్కరిణి లో పండుగలు 

భక్తులు తీర్థం పంపిణి, ఆరతి మరియు ప్రసాదం పంపిణి వంటి సాంప్రదాయ వేడుకల్లో పాల్గొంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి మరియు రధోత్సవం వంటి పండుగల సమయంలో వేడుకలు బాగా జరుగుతాయి. 

పుష్కరిణిలో సౌకర్యాలు 

తిరుమల పుష్కరిణిలో స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేసారు. పుష్కరిణి 24 గంటలూ తెరిచే ఉంటుంది.