తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాంత సేవ ప్రతి రోజు జరిగే చివరి సేవ. దీన్ని పానుపు సేవ అని కూడా అంటారు. సర్వ దర్శనం సేవ అవ్వగానే ఈ సేవ ఉంటుంది అందుకే ఇది చివరి సేవ గా పరిగణిస్తారు. ఈ పానుపు సేవ ప్రశాంత వాతావరణంలో శయన మండపంలో జరుపుతారు. వెండితో తయారు చేసిన శ్రీ భోగ శ్రీనివాస మూర్తి ని పానుపు పైన పడుకోబెడతారు.
తాళ్ళపాక అన్నమాచార్యుల వారసుడు ఈ ఏకాంత సేవ లో లాలి పాటలు ఆలపిస్తారు. ఈ లాలి పాటలు ఆలపించడం ద్వారా స్వామి వారిని నిద్రపుచ్చటమే ఈ సేవ ఉద్దేశం. ఈ పవిత్ర సేవ లో ఒక మధురమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సేవలో ప్రత్యేక నివేదనగా తరిగొండ వెంగమాంబ హారతి ఇస్తారు. అంటే దశావతారాలు డిజైన్లు ముత్యాలతో చక్కగా అలంకరించి చేసిన పళ్లెం లో హారతి ఇస్తారు. ఈ నివేదన తరిగొండ వెంగమాంబ యొక్క పవిత్ర భక్తికి నిదర్శనం.
సంవత్సరం మొత్తంలో 11 నెలలు ఈ పానుపు పైన శయనిస్తారు. భక్తులు పూజలు చేసి స్వామి ఆశీర్వాదాలు అందుకుంటారు. కానీ ధనుర్మాసం ఒక నెల మాత్రం విష్ణు మూర్తి కి ఇష్టమైన అవతారం ఐన శ్రీ కృష్ణుడు బంగారు పానుపు పైన శయనిస్తారు. రోజులు చివరి సేవ కాబట్టి ఇది ఆలయ ఆచారాలు అన్నిటికి ముగింపు అని చెప్పవచ్చు. ఈ ముగింపు సేవ భక్తులకు సంతృప్తి, ప్రశాంతతను కల్పిస్తుంది.
ఏకాంత సేవ టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ
ఈ సేవ కు టిక్కెట్టు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు.