డోనార్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? What Does Donor Privileges Mean?
టీటీడీ వారు డొనేషన్స్ చేసే భక్తులకు కొన్ని ప్రివిలేజెస్ అందిస్తున్నారు. లక్ష రూపాయలు నుండి 10 లక్షలు మరియు అంతకన్నా ఎక్కువ డొనేట్ చేసిన వారికి మరియు వారి 5 ఫామిలీ మెంబెర్స్ కి సంవత్సరం లో మూడు రోజులు vip suite లో ఫ్రీ అకామడేషన్ ఇస్తారు.
టీటీడీ వారు అందించే డోనార్ ప్రివిలేజెస్ ఏంటి? What Are The Different Privileges By TTD For Donors?
- డోనార్ మరియు 5 ఇతర ఫామిలీ మెంబెర్స్ కి సంవత్సరం లో మూడు రోజులకు L 1 బ్రేక్ దర్శన్ లో ఫ్రీ గా దర్శనం ఉంటుంది.
- సంవత్సరం లో మూడు రోజులు డోనర్ మరియు ఐదుగురు ఫామిలీ మెంబెర్స్ కి సుప్రభాత సేవ ఫ్రీ గా చూసే అవకాశం ఉంటుంది. అయితే vip దర్శనం మరియు సుప్రభాత సేవ ఒకే రోజు ఉండకూడదు.
- సంవత్సరం లో డోనార్ సెలెక్ట్ చేసుకున్న ఏదో ఒక రోజులో తిరుమల ఆలయంలో వేద ఆశీర్వాదం కూడా జరపబడుతుంది.
- 10 పెద్ద లడ్డులు, ఒక దుప్పట్టా, ఒక బ్లౌజ్ పీస్ డోనార్ కి బహుమానం గా సంవత్సరం లో ఒకసారి అందించబడతాయి.
- 5 గ్రాముల గోల్డ్ డాలర్ మరియు శ్రీ శ్రీనివాస పద్మావతి దేవీ ల చిత్రం ఉన్న ఒక గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ పతకం డోనార్ కి ఇవ్వబడుతుంది.
- 10 మహాప్రసాదం ప్యాకెట్లు డోనార్ కి సంవత్సరం లో ఒకసారి ఇస్తారు.
ఇంతే కాక శ్రీనివాస మంగాపురంలో డోనార్ కి కానీ వారి బంధువులకు కానీ “సర్వ కామ ప్రద లక్ష్మి శ్రీనివాస మహాయాగం” జరిపిస్తారు.