తిరుమల లో ప్రతి రోజు జరిగే ప్రధాన సేవలలో డోలోత్సవం సేవ ఒకటి. ఈ సేవను ఊంజల్ సేవ అని కూడా అంటారు. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పవిత్ర సేవ. భక్తులు దీన్ని శుభప్రదమైన సేవగా భావిస్తారు మరియు ఈ సేవ లో పాల్గొనడం వల్ల వారికి శుభం కలుగుతుంది అని భావిస్తారు. ఈ సేవ లో హిందూ సంప్రదాయ వేద శాస్త్రాలను అనుసరిస్తూ పూజారులు స్వామి వారికి రక రకాల పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. సేవలో పాల్గొనే భక్తులు పూజలో పాల్గొని స్వామి వారిని ప్రార్ధిస్తారు.
ఈ సేవ తిరుమల ఆలయంలో ఉన్న అద్దాల మేడ (Mirror Hall) లో జరుగుతుంది. ఈ హాల్ ఆర్జిత బ్రహ్మోత్సవం జరిగే రంగనాయక మండపానికి ఎదురుగా ఉన్న అద్దాల మండపం లో ఉంది. ఈ హాల్ లో గోడలు అన్ని అద్దాలతో అలంకరించి ఉంటాయి. శ్రీ మలయప్ప స్వామి వారు భూదేవి, శ్రీదేవి సమేతంగా ఈ మండపంలో ఉన్న ఊయలలో ఆసీనులు అవుతారు. వేద పారాయణం మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు ఊయల ఊగుతారు.
ఈ సేవ ప్రతి రోజు మధ్యాహ్నం యధావిధిగా జరుగుతుంది. ప్రధాన ఆలయం నుండి దేవతామూర్తులను ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకురావడంతో సేవ మొదలవుతుంది. దేవతామూర్తులను వస్త్రాభరణాలు అలంకరించి ఊయలలో కూర్చోబెడతారు.
డోలోత్సవం సేవ లేదా ఊంజల్ సేవ టిక్కెట్లు ధర
తిరుమల ఆలయంలో జరిగే డోలోత్సవం సేవ లేదా ఊంజల్ సేవ కి ఒక టిక్కెట్టు ధర రూ. 200 మరియు ఒక టిక్కెట్టుకు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. ఒక లాగిన్ ID తో రెండు టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్టు అక్కర్లేదు. ఈ సేవ తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనానికి సేవ టిక్కెట్టుతో వెళ్ళవచ్చు.
డోలోత్సవం సేవ లేదా ఊంజల్ సేవ రిపోర్టింగ్ సమయం మరియు ప్లేస్
డోలోత్సవం సేవ కల్యాణోత్సవం సేవ అయిన తర్వాత మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరుగుతుంది. సేవ లో పాల్గొనే భక్తులు 1:30 గంటలకు సుపథం ప్రవేశం దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
డోలోత్సవం సేవ లేదా ఊంజల్ సేవ టిక్కెట్టు ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ