తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరిపించే ఆర్జిత సేవలలో కొన్ని ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ మరియు పవిత్రోత్సవం.
ఊంజల్ అంటే ఊయల అని అర్థం. అంటే ఊయల లో దేవతలు కూర్చుకొవడం మరియు ఊగడం అని అర్థం. ఈ సేవ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు శ్రీదేవి, భూదేవి విగ్రహాలను అద్దాల మండపం లో ఒక ఊయల లో ఉంచుతారు. ఇక్కడ స్వామి వారు ఊయల లో సేద తీరుతారు. ఆ మండపం దీపాల కాంతి తో ఉంటుంది.
ఈ సేవ టిక్కెట్లు ఆన్లైన్ లో రిలీజ్ అవుతాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా దొరుకుతాయి. ఈ టిక్కెట్లు నెలకు 4600 నుంచి 4800 వరకు విడుదల అవుతాయి. అయితే ఒక ID తో రెండు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. సేవ లో పాల్గొనే ముందు మీ టిక్కెట్టు మరియు ID ప్రూఫ్ ను చూపించాల్సి ఉంటుంది.
ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ టిక్కెట్లు రిలీజ్ అవుతాయి. ఊంజల్ సేవ జరిగే సమయంలో డోలోత్సవం ఉంటుంది. అంటే వేదం పారాయణం మరియు మంగళ వాయిద్యాలతో ఈ సేవ జరుగుతుంది.
ఊంజల్ సేవ లో పాల్గొనే వారు ఉదయం 11:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు జరుగుతుంది. ఈ సేవ టిక్కెట్టు ధర రూ. 220 మరియు ఒక టిక్కెట్టుకు ఒకరిని మాత్రమే పంపిస్తారు. ఈ టిక్కెట్టు తో రెండు లడ్డులు తీసుకోవచ్చు. పాల్గొనే వారు అందరూ సుపథం దగ్గరకు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్జిత బ్రహ్మోత్సవం తిరుమల లో వైభవోత్సవ మండపం లో జరుగుతుంది. ఇక్కడే భగవంతుని వాహనాలు సంవత్సరం అంత ఉంచబడతాయి. ఈ సేవ వైభవోత్సవ మండపం లో ప్రతి రోజూ జరుగుతుంది. అసలు బ్రహ్మోత్సవం నవంబర్ నెలలో ఘనంగా జరుగుతుంది. అయితే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ చిన్న బ్రహ్మోత్సవం గా ప్రతి రోజు నిర్వహిస్తారు. డోలోత్సవం పూర్తయిన తర్వాత ఈ సేవ ఉంటుంది. ఈ ఉత్సవం లో మలయప్ప స్వామి తన జీవిత భాగస్వాములతో పాటు శేష, గరుడ మరియు హనుమంతులను మూడు వాహనాలపై పూజిస్తారు. ఈ సేవ ను ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం లో నిర్వహిస్తారు.
ఈ సేవ మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 2:30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే భక్తులు సేవ సమయానికి గంట ముందుగానే “సుపాదం” లో వేచి ఉండాలి.
ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ కు టిక్కెట్టు ధర రూ. 200. ఒక లాగిన్ id తో రెండు టికెట్లు వరకు బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎంట్రీ టికెట్టు అవసరం లేదు.
ఈ టిక్కెటు మనం TTD వెబ్సైటు లో బుక్ చేసుకోవచ్చు. అందులో ఉన్న ఆర్జిత సేవలలో ఆర్జిత బ్రహ్మోత్సవం అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని అవైలబిలిటీ ని చెక్ చేసుకోవాలి.
ఈ టిక్కెట్లు 4 నెలల ముందుగానే విడుదల అవుతాయి. పైన చూపించిన విధంగా గ్రీన్ కలర్ లో ఉంటే టిక్కెట్లు ఉన్నాయి అని అర్థం. ఒకవేళ టిక్కెట్లు లేకపోతే అది రెడ్ కలర్ లో చూపిస్తుంది.
ఆర్జిత బ్రహ్మోత్సవం అని సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి.
అందులో టిక్కెట్టు బుక్ చేసుకుని పేమెంట్ పూర్తి అవ్వగానే మీకు మెయిల్ మరియు టెక్స్ట్ మెసేజ్ లో టికెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
కల్యాణోత్సవం టిక్కెట్టు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఈ టిక్కెట్టు బుక్ చేసుకోవాలి అంటే టీటీడీ సైట్ లో ఆర్జిత సేవలకు రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న టిక్కెట్లను లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి ఎంపికైన వారి మొబైల్ కి మెసేజ్ పంపిస్తారు. అలాగే offline లో చేసుకోవాలి అనుకుంటే CRO ఆఫీస్ కి వెళ్లి ముందు రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ రోజూ ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు చేసుకోవచ్చు. సాయంత్రం 5:00 గంటలకు లక్కీ డిప్ లో రిసల్ట్ తెలుస్తుంది. ఒక టిక్కెట్టు కు ఇద్దరు పాల్గొనవచ్చు. 12:00 గంటల నుంచి 1:00 గంట వరకు ఈ కల్యాణోత్సవం జరుగుతుంది
ఈ సేవ లో పాల్గొనే వారు 10:30 గంటలకు సుపాదం దగ్గర చేరుకోవాలి.
తిరుమలలో జరిగే ఆర్జిత సేవలలో సహస్ర దీపాలంకరణ సేవ ఒకటి. శ్రీ మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంచి 1000 వత్తి దీపాలతో అలంకరించి చేసే సేవే ఈ సహస్ర దీపాలంకరణ సేవ. ఈ సేవ ఊంజల్ మండపం లో ఫ్రీ రోజు సాయంత్రం 5:30 గంటలకు జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని సహస్ర దీపాలు వెలిగించి ఊరేగింపు కు తీసుకు వెళ్తారు. అక్కడ అన్నమయ్య కీర్తనలు మరియు వేద మంత్రాలు ఉంటాయి. ఈ సేవ లో పాల్గొనే వారు 5:00 గంటల కాళ్ళ సుపాదం దగ్గర వేచి ఉండాలి.
ఈ టిక్కెట్లు ఆన్లైన్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 11 గంటలకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే TTD official సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో సెలెక్ట్ ఐన వాళ్ళు టిక్కెట్టు కి రూ. 220 కట్టాలి. ఒక టిక్కెట్టుకు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవ ప్రతి రోజు జరుగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ పవిత్రోత్సవాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి మరియు త్రయోదశి రోజులలో జరుపుతారు. ఈ మూడు రోజులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన విగ్రహం మరియు ఇతర ముఖ్య విగ్రహాలకు తిరుమంజనం మరియు హోమం జరిపిస్తారు. ఈ పవిత్రోత్సవం మొదలు పెట్టే ముందు రోజు ఉత్సవానికి అంకురార్పణగా 9 రకాల ధాన్యాలు ఒక మట్టి పాత్రలో విత్తుతారు. ఈ సేవ కు టిక్కెట్టు ధర రూ. 2500. ఇది ఉదయం 8:00 గంటలకు మొదలవుతుంది.
దీని టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ముందుగా అఫీషియల్ సైట్ లో పవిత్రోత్సవం అను ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి.