తిరుమల ఆలయానికి చేరుకోవడానికి ఉండే దారుల్లో అలిపిరి మెట్లు మార్గం ఒకటి. ఈ మార్గం లో భక్తులు నడిచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ అలిపిరి మెట్టు మార్గం అలిపిరి లో మొదలయ్యి తిరుమల వరకు ఉంటాయి. దీన్ని ఆదిపాది అని అంటారు అంటే కింద ఉన్న మెట్టు అని అర్థం.
అలిపిరి మెట్లు మొత్తం 3500 ఉన్నాయి. ఈ మార్గం మొత్తం 9 KM ల దూరం ఉంటుంది. తిరుపతి బస్సు స్టాండ్ నుంచి 5 KM ల దూరం లో ఉంది. ఈ మార్గం ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ఫుడ్ స్టాల్ల్స్ కూడా ఉంటాయి. అలిపిరి మెట్టు మొదట్లో ఉన్న లగేజ్ కౌంటర్ లో డిపాజిట్ చేసి తిరుమల కి నడక ప్రారంభం అవ్వచ్చు.
ఈ మార్గం లో వెళ్లే వాళ్ళు దివ్య దర్శనం టోకెన్లు గాలి గోపురం దగ్గర టోకెన్ తీసుకొని స్టాంప్ వేయించుకోవచ్చు.
అలిపిరి గురించి మరింత సమాచారం More About Alipiri
అలిపిరి పాదాల మండపం లేదా అలిపిరి ఏడుకొండలకు ప్రారంభమయ్యే ప్రదేశం. అలిపిరి మెట్లు అని పిలవబడే అలిపిరి నుంచి బయల్దేరే భక్తులు వెంకటేశ్వర స్వామికి కాలినడకన వస్తాం అని చేసిన మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నుండి తిరుమల కి చేరుతారు. దారిలో నాలుగు ఆలయ గోపురాలు ఉన్నాయి.
ఈ మార్గం ఏడు కొండలలో ఒకటి అయిన శేషాచలం కొండల గుండా వెళ్తుంది. ఈ అలిపిరి మెట్ల దారిలో మూడు నెలలకు ఒకసారి మెట్లోత్సవం జరుపుతారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఉత్సవం. ఈ పండుగలో భక్తుల బృందం ఆధ్యాత్మిక పాటలు పాడుతూ తిరుమల చేరుకుంటారు.
అలిపిరి మెట్టు చరిత్ర
పూర్వం అలిపిరి ని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలవబడుతోంది. ఈ చెట్టు కిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి.
అలిపిరి తో ముడిపడి ఉన్న ప్రముఖ పురాణాలలో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర పురాణం ప్రకారం చెప్పిన చరిత్ర ఇది. శాశ్వతమైన ఆనందాన్ని మరియు విశ్రాంతిని కోరుకునే లక్ష్మి దేవి ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి విష్ణువు వెంకటేశ్వరునిగా అవతరించాడు. అలా అవతరించిన వేంకటేశ్వరునికి అలిపిరి ముఖద్వారంగా ఉండే ఏడు కొండలు నివాసంగా మారాయి.
తొండమాన్ యొక్క కధ, అతని భక్తి మరియు అంకితభావం తో వేంకటేశ్వరునికి “అలుపిరి వెంటయ్య” అనే పేరు వచ్చింది. తొండమాన్ రాజు యొక్క నిస్వార్ధమైన సేవ మరియు విశ్వాసం కి చిహ్నంగా అలిపిరి గౌరవించబడుతుంది.
పవిత్రమైన అలిపిరి తిరుమల ఏడు కొండలతో ముడిపడింది. ప్రతి కొండకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కొండలు ఆది శేషుని రూపాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు.
1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో వర్ణించారు. గాలిగోపురం వరకు ఎక్కడం, దిగడం చాలా కష్టం అని ఆయన రాశారు. అక్కడ నుంచి కొంత దారి బావుండేది అని మళ్ళీ దారి ఎత్తు పల్లాలు గా ఉండేది అని తర్వాత ప్రయాణం అంత కష్టంగా ఉండదు అని ఆయన రాశారు. మధ్యలో విశ్రాంతికి మండపాలు ఉండేవి అని రాశారు. గాలిగోపురం వద్ద ఒక మహర్షి శ్రీరామునికి పూజ చేస్తూ భక్తులకి మజ్జిగ వంటివి అందించేవారని రాసారు.