Menu
Details Of Tirumala Srivari Steps Way

తిరుమల ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులలో నడక మార్గం లో వచ్చే భక్తులు కూడా ఉంటారు. నడక దారిలో వచ్చే మార్గాలలో  అలిపిరి మెట్టు మరియు శ్రీవారి మెట్టు అని రెండు మార్గాలు ఉన్నాయి. 

తిరుమలకు చేరుకోవడానికి  శ్రీవారి మెట్టు మార్గం ఉదయం  6:00  గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అందుబాటులో  ఉంటుంది. ఈ  మెట్టు మార్గంలో వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేసుకోవచ్చు. శ్రీవారి మెట్టు లో వచ్చే భక్తులకు తిరుమల ఆలయంలో దర్శనం కోసం దివ్య దర్శనం టోకెన్లు 10 వ శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తారు. ఆ టోకెన్ కు స్టాంప్ 1200 వ మెట్టు దగ్గర స్టాంప్ వేయించుకోవచ్చు. అక్కడ దర్శనం టైం స్లాట్ ఇస్తారు ఆ టైం ప్రకారం క్యూ కాంప్లెక్స్ లో బాలాజీ దర్శనం చేసుకోవచ్చు.. 

ఒక రోజుకి 6000 దివ్య దర్శనం టిక్కెట్లు ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తుల కోసం విడుదల అవుతాయి.  ఈ మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి తిరుమల ఆలయానికి  12 KM ల దూరం ఉంటుంది. 

శ్రీవారు మొదటి సారి తిరుమల కు వచ్చినప్పుడు ఈ పవిత్రమైన శ్రీవారి మెట్టు మార్గం లో నే వచ్చారని చరిత్ర చెబుతుంది. ఆ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కళ్యాణం అయిన తర్వాత ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు. 

తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి. తిరుమల లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మెట్టు మార్గం తెలిసేది. ఇప్పుడిప్పుడే బయట నుంచి వచ్చిన భక్తులకు శ్రీవారి మెట్టుదారి గురించి తెలిసింది. ఒకప్పుడు చంద్రగిరి నుంచి తిరుమలకు మరియు తిరుమల నుండి చంద్రగిరి కి ఇక్కడ నుంచే దారి ఉండేది. 

శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య వంటి మహా భక్తులు ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారని చెబుతారు. 

తిరుమల ఆలయానికి అలిపిరి మెట్లు మార్గం నుంచి నాలుగు నుంచి అయిదు గంటల సమయం పడితే, శ్రీవారి మెట్టు మార్గం నుండి ఆలయానికి చేరుకోవడానికి గంట నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది. ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 KM ఉంటుంది.