తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం, అక్షరాభ్యాసం మాత్రమే కాకుండ అన్నప్రాసన కూడా జరిపిస్తారు. తిరుమలలో జరిగే అన్నప్రాసన పసి పిల్లలకు అన్నం తినిపించే ఒక శుభప్రదమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఒక ప్రక్రియను అనుసరిస్తూ ఆనందంగా మీ బిడ్డకు అన్నప్రాసన ఈ పవిత్రమైన ఆలయంలో జరిపించుకోవచ్చు.
ఒక అన్నప్రాసన టిక్కెట్టు ధర రూ. 200. ఈ బుకింగ్ పూర్తి కాగానే మీకు SMS లేదా mail ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీరు టికెట్ బుకింగ్ చేసుకున్న రోజు పూజ టైం లో పురోహిత సంఘం దగ్గరికి చేరుకోవాలి.
ఈ అన్నప్రాసన పూజ ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహిస్తారు.
పూజ లో పాల్గొనే పురుషులు వైట్ ధోతి మరియు షర్ట్ లేదా కుర్తా & పైజామా ధరించాలి. స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి.
అన్నప్రాసన ప్రక్రియ
- అర్చకులు అన్నప్రాసన సింగల్ గా లేదా గ్రూప్ గా జరిపిస్తారు. పూజ లో పాల్గొనే వాళ్ళు తిరుమల రామ్ బగీచా గెస్ట్ హౌస్ దగ్గర పూజ సామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చు. పూజ సామాగ్రి లో పసుపు, కుంకుమ, తమలపాకులు, వొక్క, చందనం, కర్పూరం, ధూప్ స్టిక్స్, కొబ్బరికాయలు, బియ్యం, తేనె, కొత్త టవల్, పువ్వులు, అగ్గిపెట్టె, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, అన్నప్రసాదం బౌల్, బంగారం లేదా వెండి ఉంగరం, చాకు/Knife ఉండాలి.
- పురోహిత సంఘం దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ లో అన్నప్రాసన టికెట్ తీసుకోవాలి. ఈ టిక్కెట్లకు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదు.
- పూజ చేసే డేట్ మరియు ముహూర్తం టైం ని బట్టి అన్నప్రాసన ఒక చైల్డ్ కి లేదా చిల్డ్రన్ గ్రూప్ కి చేయబడుతుంది
- గ్రూప్ లో ఒకరు నుంచి ఐదుగురు మంది వరకు ఉండచ్చు.
- ఈ పూజ గణపతి పూజ తో ప్రారంభమవుతుంది, తర్వాత అన్నప్రసాదాన్ని పిల్లలకి వెండి లేదా బంగారు ఉంగరం తో తినిపిస్తారు.