తిరుమల లో ప్రతి రోజు జరిగే సేవలతో పాటు కళ్యాణం, అక్షరాభ్యాసం వంటి పూజలు కూడా భక్తుల కోసం జరిపిస్తారు. తిరుమల లో అక్షరాభ్యాసం చేయించుకుంటే పిల్లలకు మంచిది అని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే తిరుమల లో ప్రతి రోజు ఈ అక్షరాభ్యాసం జరుగుతుంది. పిల్లల చదువు ని ప్రారంభించు పవిత్ర పూజ గా భక్తులు అక్షరాభ్యాసం చేయిస్తారు. అటువంటి పవిత్ర పూజ ను పవిత్ర దేవాలయం అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తితో జరిపిస్తే అది ఇంకా పవిత్రంగా ఉంటుంది అని భక్తులు భావిస్తారు.
అక్షరాభ్యాసం పూజ సమయం మరియు పూజ ప్రదేశం
ఈ అక్షరాభ్యాసం సేవ ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పురోహిత సంఘం (కళ్యాణ వేదిక) దగ్గర జరుగుతుంది. ఇది తిరుమలలో ఉన్న పాపవినాశనం రోడ్డు లో ఉంది.
ఈ అక్షరాభ్యాసం పూర్తి అవ్వటానికి సుమారు 25 నుంచి 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. దీనికి ఒక టిక్కెట్టు ధర రూ. 200 అంటే ఒక చైల్డ్ కు అక్షరాభ్యాసం రూ. 200.
ఈ పూజ లో పాల్గొనే వారు పురుషులు అయితే వైట్ షర్ట్ లేదా కుర్తా మరియు పైజామా ధరించాలి. స్త్రీలు అయితే చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి.
జీన్స్, టీ షర్ట్ వంటివి అనుమతించబడవు.
తిరుమల తిరుపతి దేవస్థానం లో అక్షరాభ్యాసం ప్రక్రియ
అక్షరాభ్యాసం పూజ నియమించబడిన వేదిక వద్ద పూజారులు చేయిస్తారు. ఈ పూజ చేయించుకునే భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి సమీపంలో ఉన్న హయగ్రీవ స్వామి ఆలయం దగ్గర ఒక రోజు ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్షరాభ్యాసం పూజ మీరు ఎంచుకునే డేట్ ప్రకారం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలకు ఒకేసారి జరుపుతారు.
భక్తులు పూజకు కావలసిన సామాగ్రి వారు ఏర్పాటు చేసుకోవాలి. తిరుమల రామ్ బగీచా గెస్ట్ హౌస్ లో ఈ పూజ సామాగ్రి అందుబాటులో ఉంటుంది.
అక్షరాభ్యాసానికి కావలసిన పూజ సామాగ్రి