Menu
Details About Laddu Prasadam In Tirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజూ అనేక రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అన్న ప్రసాదాలు, పాలు, పండ్లు ఇలా రక రకాలు నివేదిస్తారు. అయితే వాటిలో ప్రాముఖ్యమైనది లడ్డు. తిరుపతి లడ్డు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అంత రుచి దానికి. అసలు ఈ లడ్డు చరిత్ర ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు ఏ పదార్థాలు వాడతారు, తిరుమల లడ్డు ఎక్కడ దొరుకుతుంది  ఇలాంటి వివరాలు అన్ని ఇప్పుడు తెలుసుకుందాం.  

తిరుమల లడ్డు చరిత్ర 

ఈ లడ్డు చరిత్ర తెలుసుకోవాలి అంటే మనం 18 వ శతాబ్దం లోకి వెళ్ళాలి. ఆ శతాబ్దంలో ఈ తిరుమల ప్రాంతాన్ని పాలించిన రాజు ఈ లడ్డు ని తొలిసారి పరిచయం చేశారు. మొదట్లో ఈ లడ్డూను తిరుమల ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే నివేదించే వారు. రాజు గారు ఒకసారి ఈ ప్రసాదాన్ని రుచి చూసి సంతోషించి ఈ ప్రసాదాన్ని తయారు చేసి ఆలయాన్ని దర్శించటానికి వచ్చిన భక్తులు అందరికి పంచాలని ఆదేశించారు. అలా ఈ లడ్డు ప్రజాదరణ పెరిగి ఆలయంలో అది ప్రధాన నైవేద్యం గా మారింది. ఇప్పుడు ఇది ఆలయం ప్రసాదాలలో ఎక్కువగా కోరుకునే ప్రసాదంగా పరిగణించబడుతోంది. 

లడ్డు తయారీలో వాడే పదార్ధాలు మరియు తయారీ విధానం 

ఈ లడ్డూను చాలా తేలికగా చాలా తక్కువ పదార్థాలు వాడి తయారు చేస్తారు. ఇందులో సెనగపిండి (Gram Flour), పంచదార, నెయ్యి, ఏలకులు మరియు కిస్మిస్ వంటి పదార్థాలు వాడి తయారు చేస్తారు. అయితే ఈ లడ్డు తయారీ విధానం చాలా కష్టమైన పని. దీన్ని తయారు చేయడానికి నైపుణ్యం కావాలి. 

ముందు శెనగపిండి ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో పంచదార వేసి పాకం వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత దానిలో నెయ్యి, యాలకులు, కిస్మిస్ వేసి ఆ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతారు. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డు ఆకారంలో చేస్తారు. ఇది చాలా సున్నితంగా చుట్టాలి కాబట్టి ఇక్కడ నైపుణ్యం ఉన్న వాళ్ళు  ఉంటారు.

తిరుమల లడ్డు ప్రాముఖ్యత

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు చాలా ప్రాముఖ్యమైనది. ఇది పవిత్రమైన ప్రసాదంగా మరియు స్వామి వారి ఆశీర్వాదం గా భావిస్తారు ఇక్కడ భక్తులు.

తిరుమల లడ్డు ఎక్కడ దొరుకుతుంది?

తిరుమల లడ్డు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో మాత్రమే అమ్మబడుతుంది. తిరుమలలో ఈ లడ్డు ప్రసాదం రోజుకు సుమారు 3 లక్షల లడ్డూలు అమ్మ బడతాయి. అయితే ఈ లడ్డులు ఆన్లైన్ లో అమ్మడం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్ లో తీసుకోవచ్చు.  ఒక పెద్ద లడ్డూ ధర రూ. 200 మరియు ఒక మీడియం సైజు లడ్డూ ధర రూ. 50. అలాగే మీరు రూ. 50 లకు ఎక్స్ట్రా లడ్డు కూడా తీసుకోవచ్చు. ఒకరికి 2 నుంచి 4 ఎక్స్ట్రా లడ్డులు తీసుకోవచ్చు.. 

ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం మరియు సేవ టిక్కెట్టుతో  దర్శనం చేసుకున్న వారికి ఒక టిక్కెట్టుకు ఒక ఉచిత లాడుకు ఇస్తారు. కళ్యాణోత్సవ సేవ చేసుకున్న భక్తులకి లడ్డు, వడ, జాకెట్టు ముక్క ప్రసాదంగా ఇస్తారు. 
సర్వ దర్శనం చేసుకున్న వారికి ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తారు.