తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అవకాశం ఉంది. అదే శ్రీవారి సేవకులు గా రిజిస్టర్ చేసుకునే అవకాశం. శ్రీవారి సేవకులు అంటే ఆలయంలో రద్దీ నిర్వహణ, భక్తులకు సమాచారం అందించడం, ప్రతి రోజు జరిగే సేవలలో సహాయం చేయడం వంటి పనులు చూసుకునే వాలంటీర్లు.
మీరు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి సేవకులు గా అవ్వాలంటే టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవారి సేవకులు లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
తిరుమల ఆలయంలో చాలా రకాల సేవలు ఉన్నాయి. హిందూ సనాతన ధర్మం లో ఉన్న గొప్పతనం “మానవ సేవే మాధవ సేవ” అని నమ్మకం. తిరుమల నంబి, శ్రీ రామానుజాచార్య, అనంతాళ్వార్ వంటి చాలా మంది ఆచార్యులు వారి జీవితాలని మానవ సేవ కు అంకితం చేసారు. ఇలాంటి గొప్ప అంశం నుంచి టీటీడీ వారు ఈ శ్రీవారి సేవ ని 2000 సంవత్సరం లో ప్రవేశ పెట్టారు. ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయం అందచేయడం.
200 మంది శ్రీవారి సేవకులతో మొదలైన ఈ సేవ ఇప్పటికి 5 లక్షల సేవకులకు చేరుకొని భక్తులకు తమ సేవలను అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సా, న్యూ ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. పండుగలు మరియు ముఖ్యమైన రోజులలో ఆలయంలో ఒక రోజుకి 1000 మందికి పైగా సేవకులు సేవలను అందిస్తారు.
12 వ శతాబ్దం నుంచి ఇలా ఆలయంలో విధులు చూసే వాలంటీర్లు పద్ధతి ఉంది. టీటీడీ వారు 1930 ల లో పునరుద్దించబడింది.
శ్రీవారి సేవకులు సెలక్షన్ ప్రక్రియ మరియు విధులు Srivari Sevaks Selection Procedure & Duties
శ్రీవారి సేవకులు గా పాల్గోవాలి అంటే టీటీడీ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. అయితే సేవకులుగా పాల్గోవాలి అంటే అర్హత ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ప్రకారం పాల్గొనే వారు మంచి ఆరోగ్యం ఉన్న 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న హిందువు వాలంటీర్లు అయుండాలి మరియు వారు తెలుగు లేదా ఆంగ్ల భాషను మాట్లాడగలగాలి.
శ్రీవారి సేవకులు గా సెలెక్ట్ అయిన వారికి ఆలయ చరిత్ర తెలియచేయటం, ఆలయ ఆచారాలు, రద్దీ నిర్వహణ వంటి వివిధ రకాల ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత శ్రీవారి సేవకులకు కొన్ని విధులు ఇస్తారు. అవి:
- ఆలయంలో పండుగలు మరియు ముఖ్యమైన ఈవెంట్స్ జరిగే సమయంలో రద్దీ నిర్వహణ లో సహాయం ఉండటం
- భక్తులకు ఆలయం గురించి ఆలయంలో జరిగే సేవల గురించి సమాచారం ఇవ్వడం
- ఆలయంలో ప్రతి రోజు జరిగే సేవలలో సహాయం ఉండటం
- ఆలయ సముదాయాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం
- భక్తులకు అన్నప్రసాదం పంచడంలో సహాయం గా ఉండడం
ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని శ్రీవారి సేవకులు చూసుకోవాల్సిన బాధ్యతలు.
శ్రీవారి సేవకుల పాత్ర ఆలయంలో ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. వారి సహాయ సహకారాలు వల్ల ఆలయంలో సేవలు ప్రశాంతంగా జరుగుతాయి. అలాగే ఆలయానికి విచ్చేసిన భక్తులకు సహాయం మరియు మార్గదర్శకత్వం అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
శ్రీవారి సేవకులు బుకింగ్ ప్రక్రియ Srivari Sevaks Booking Procedure
- టీటీడీ వెబ్ సైట్ ఓపెన్ చేసి “సేవ ఎలక్ట్రానిక్ డిప్ “ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి
- అందులో “శ్రీవారి సేవకులు” ఆప్షన్ ను ఎంచుకోండి
- అప్పుడు సేవ టైం స్లాట్స్ మరియు లభ్యత ఉన్న డేట్స్ చెక్ చేసుకోండి
- డేట్ మరియు టైం స్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ పేరు, అడ్రస్ మరియు కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి
- తర్వాత శ్రీవారి సేవకులు స్లాట్ కి పేమెంట్ పూర్తి చేయండి
శ్రీవారి సేవకుల సేవల ప్రాంతాలు Areas of Service For Srivari Sevaks
సేవకులు తమ అభిరుచికి అనుగుణంగా తమ సేవ ప్రాంతాలను ఎంచుకోవచ్చు. దీనికి తిరుమల బస్టాండ్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ లో పది మందికి తక్కువ కాకుండ మరియు ఒక వారం పాటు సేవ చేయగలిగే వాళ్ళు ముందుగా చెప్పి సేవ లో పాల్గొనవచ్చు. సేవ లో పాల్గొన్న వారికి ఆహరం మరియు వసతి ఉచితంగా ఏర్పాటు చేస్తారు.
- సేవకులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో భక్తులకు సేవ చేయచ్చు
- అన్నప్రసాదం లో చేసే వంటలకు కావాల్సిన కూరగాయలను తరిగి అన్నప్రసాదం కాంప్లెక్స్ లో సేవ చేయచ్చు
- ఎంప్లొయ్ కాంటీన్ లో సేవకులు, ఉద్యోగులు మరియు స్కౌట్స్ కు అన్నప్రసాదం వడ్డించే సేవ చెయ్యొచ్చు
- రామ్ బగీచా బస్సు స్టాండ్, CRO ఆఫీస్ మరియు PAC - I దగ్గర ఉన్న మొబైల్ ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాన్ని అందించొచ్చు
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర వెయిటింగ్ లో ఉన్న భక్తులకి ఆహారాన్ని అందించొచ్చు.
- అలాగే రద్దీ ఎక్కువగా ఉన్నపుడు నారాయణగిరి గార్డెన్స్ లైన్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదం అందించటం
- నీరు, మజ్జిగ, పాలు మరియు కూల్ డ్రింక్స్ వంటివి భక్తులకు అందించటం
- క్యూ లైన్ లో ఉన్న భక్తుల రద్దీ ని నిర్వహించటం మరియు వారి బాగేజ్ లను వివిధ ముఖ్యమైన పాయింట్లు లో స్కానింగ్ చేయడం
- కల్యాణకట్ట టోన్సురింగ్ ఏరియా లో భక్తులకు మార్గం చూపించడం మరియు బ్లెడ్స్ అందించడం మరియు భక్తులకు తిరునామం వేయడం వంటి సేవలు చేయచ్చు
- వీటితో పాటు ANC ఏరియా లో, సప్తగిరి సత్రాలు ఏరియా లో భక్తులకు అలాట్ చేసిన రూమ్స్ ని శుభ్రంగా మైంటైన్ చేయడం
- భక్తులకు కొబ్బరి కాయలను అమ్మడం, బుక్ స్టాల్ల్స్ లో ఉన్న టీటీడీ పబ్లికేషన్స్ ని సేల్ చేయడం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్ లో వెయిటింగ్ లో ఉన్న భక్తుల అభిప్రాయం తీసుకోవడం మరియు భక్తులకు సహాయం చేయడం
- ఆలయ సముదాయాలని పరిశుభ్రంగా ఉంచే క్లీనింగ్ డ్యూటీ చేయడం
ఇలాంటి రక రకాల సేవలలో తమకి నచ్చిన సేవను శ్రీవారి సేవకులు ఎంచుకుని ఇలాంటి పవిత్ర కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.
శ్రీవారి సేవకులకు టీటీడీ సూచనలు TTD General Instructions To Srivari Sevaks
- పరకమని సేవ, లడ్డు ప్రసాద సేవ మరియు సాధారణ సేవలు చేసే వారు హిందువులు అయ్యుండాలి
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో చేసే వారు, కంప్యూటర్ మీద అవగాహన ఉన్నవారు ఎంప్లాయ్ ID లేదా ఆధార్ కార్డు ప్రూఫ్ తో లడ్డు ప్రసాదం సేవకు అప్లై చేసుకోవచ్చు. 8 రోజులు ముందుగా సేవకులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది
- ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు పరకమని సేవకు అర్హులు కారు
- సాధారణ సేవ లేదా పరకామణి సేవ లేదా లడ్డు ప్రసాద సేవ లో ఒకసారి పాల్గొన్న సేవకులు మరల 90 రోజుల తర్వాత మాత్రమే పాల్గోవాలి
- సాధారణ, పరకామణి, లడ్డు ప్రసాద సేవలలో పాల్గొనే వారు srivariseva.tirumala.org లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- ప్రొఫైల్ లో డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ID ప్రూఫ్ నెంబర్, ఉద్యోగ రంగం వంటి మీ వివరాలు ఒకసారి ఇచ్చాక సవరించబడవు
- లడ్డు ప్రసాద సేవకుల వసతిని రామ్ బగీచా రెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి సేవ సదన్ కు మార్చబడింది
- పరకామణి సేవకుల వసతి శ్రీ వరాహ స్వామి రెస్ట్ హౌస్ లో ఉంటుంది
- పరకామణి సేవకులు ఒక రోజుకి 250 మంది వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది
- భక్తులు సాధారణ, పరకామణి మరియు లడ్డు ప్రసాద సేవకులుగా అప్లై చేసుకోవాలి అంటే శ్రీవారి సేవ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- కంఫర్మ్ అయిన పరకామణి లేదా లడ్డు ప్రసాద సేవ సర్వీసులు శ్రీవారి సేవకులు సేవ హిస్టరీ లో దాన్ని కాన్సల్ చేసుకోవచ్చు