Menu
Complete Details About Srivani VIP Break Darshan Ticket

శ్రీవాణి బ్రేక్ దర్శనం అంటే ఏంటి?

TTD  వారు భక్తులు సులభంగా, ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోవాలని శ్రీవాణి బ్రేక్ దర్శనం అనే టికెట్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా తిరుమల దర్శనం కోసం చాలా సేపు  క్యూ లైన్ లో నిలబడాల్సి ఉంటుంది.  ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం ద్వారా ఇది సులువైంది. 

శ్రీవాణి బ్రేక్ దర్శనం భక్తులకు దర్శనం సమయాన్ని ముందు గానే చూపిస్తుంది మరియు ప్రత్యేక లైన్ లో దర్శనానికి  తీసుకెళ్తుంది.  ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లను online లో లేదా TTD కౌంటర్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లను మనకు కావాల్సిన తేదీ లో మనకి కావలసిన సమయానికి దర్శనం అయ్యేలా date & time సెలెక్ట్  చేసుకోవచ్చు.  

శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ కోటా 

శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు కొన్ని online మరి కొన్ని offline లో విడుదల చేస్తారు. దాన్ని quota అంటారు. ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు 1000 టిక్కెట్లను విడుదల చేస్తారు. ఆ 1000 లో 750 టిక్కెట్లు ఆన్లైన్ కోట లో 250 టిక్కెట్లను offline అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్ లో విడుదల చేస్తారు.  ఈ టికెట్ offline కౌంటర్ లో తీసుకోవాలి అంటే బోర్డింగ్ పాస్ ను అటాచ్ చేయాల్సి ఉంటుంది. 

శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు online లో నెల ముందు విడుదల చేస్తారు మరియు offline లో ఒక రోజు ముందుగా బుక్ చేసుకోవచ్చు. 

శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్టు డొనేషన్ ద్వారా వస్తుంది. ముందుగా మనం శ్రీవాణి డొనేషన్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. తర్వాత బ్రేక్ దర్శన్ టిక్కెట్టు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

1.ముందుగా TTD Official Site ను ఓపెన్ చేసి అందులో శ్రీవాణి మరియు ఇతర డొనేషన్ ఆప్షన్ ను ఓపెన్ చేయాలి.

2. ఇప్పుడు మీకు వేరే పేజీ లో వరుసగా ఒప్షన్స్ కనిపిస్తాయి. అందులో “Donation” అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని  సెలెక్ట్ చేసుకోండి.

 

3. అక్కడ మీకు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. కొత్తగా వచ్చిన వారు అయితే రిజిస్టర్ చేసుకోవాలి.

4. డొనేషన్ ఒప్షన్స్ కనిపిస్తాయి. మీరు రూ. 1 నుంచి రూ. కోటి అంత కన్నా ఎక్కువ వరకు డొనేట్ చేయవచ్చు.  కానీ రూ. 10,000 డొనేషన్ ఇచ్చిన వారికే   బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.  లాగిన్ అవ్వగానే మీరు “Continue to Donate” అనే బటన్ ని క్లిక్ చేయాలి.

5. దాని తర్వాత మీరు ఎంత మొత్తం డొనేట్ చేయాలి అనుకున్నారో ఆ అమౌంట్ ను ఎంటర్ చేయండి. 

6. పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని “Pay Now” ను సెలెక్ట్ చేయండి.

 

7. మీరు డొనేట్ చేసిన అమౌంట్ కింద ఎంత మంది దర్శనం చేసుకోవాలో నెంబర్ ఎంటర్ చేయండి. ఒక డొనేషన్ కి 9 మంది దర్శనం చేసుకోవచ్చు.

8. తర్వాత వారి పూర్తి వివరాలు నమోదు చేయాలి మరియు  ID Card ను సెలెక్ట్ చేసుకోవాలి.  మీరు సెలెక్ట్ చేసిన ID Card దర్శనానికి వెళ్లే ముందు చూపించాలి.

9. మీ పేమెంట్ పూర్తి కాగానే మీకు ఒక డొనేషన్ రిసిప్ట్ కనిపిస్తుంది.

10. ఇప్పుడు మెనూ కి వెళ్లి “Donor Privileges” అను ఒక ఆప్షన్ ను క్లిక్ చేసి బుకింగ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. 

             

11. తర్వాత  మీ దర్శనం డేట్ కి స్లాట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఓకే బటన్ ని నొక్కాలి.


12. దర్శనం కోసం రూ.500 ను పే చేయాలి.

13. మీకు దర్శనం టిక్కెట్టు వస్తుంది. 

ఇలా మీరు శ్రీవాణి డొనేషన్ లో డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. 

శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే తిరుమల జేఈఓ ఆఫీస్ లో కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్లు ఆఫ్లైన్ లో బుక్ చేసుకునేందుకు ఏదైన ఐడెంటిఫికేషన్ డాక్యుమెంటు ఒరిజినల్ మరియు 3 సెట్ల ఫోటోస్టాట్ కాపీ తీసుకుని వెళ్ళాలి. ఇండియన్ సిటిజన్ అయితే ఆధార్ కార్డు వంటివి మరియు ఫారినర్ అయితే పాస్పోర్ట్ వంటివి తీసుకెళ్లవచ్చు. శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఆఫ్లైన్ ధర రూ. 10,500. అంటే రూ. 10,000 డొనేషన్ గాను రూ.500 దర్శనం టిక్కెట్టు గాను తీసుకోబడుతుంది.