తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తిరుమల లో స్వామి వారి దర్శనానికి ఫామిలీ తో వెళ్ళాలి అనుకుంటే వాతావరణం, రద్దీ తీవ్రత వంటి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
- రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతమైన దర్శనం చేసుకోవాలి అనుకుంటే పీక్ సీజన్ కాని సమయంలో దర్శనానికి ప్లాన్ చేసుకోండి. అంటే వీక్ డేస్ లో (పబ్లిక్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ టైం కాకుండా). ఎందుకంటే అలాంటి సమయంలో వెయిటింగ్ టైం తక్కువ ఉండి ప్రశాంతమైన దర్శనం చేసుకోవచ్చు. అలాగే వినాయక చవితి వంటి పండుగ రోజులు కూడా తక్కువ రద్దీ ఉండచ్చు.
- తిరుమల ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది మరియు వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి వేసవి సమయంలో (April to June) ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండ ను తట్టుకోగలం అనుకుంటే తిరుమల ఆలయానికి ఫామిలీ తో రావొచ్చు. ఎండ లో రాలేము అనుకుంటే మీరు చల్లని వాతావరణం ఉండే సమయంలో (November to February ) ప్లాన్ చేసుకోవచ్చు.
- పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇలా ఉత్సవాలు వేడుకలు దగ్గరగా చూసిన అనుభూతిని పొందాలి అనుకుంటే వేడుకల సమయంలో తిరుమల ఆలయానికి ఫామిలీ తో ప్లాన్ చేసుకోండి. అయితే ఆ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది దర్శనానికి ఎక్కువ సమయం క్యూ లో ఉండాల్సి వస్తుంది.
- చిన్న పిల్లలు ఉండి వారితో తిరుమల దర్శనం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే రద్దీ లేని సమయాల్లో వెయిటింగ్ టైం తక్కువ ఉండే సమయాల్లో ప్లాన్ చేసుకోండి.
- మీరు ఫ్యామిలీ తో దర్శనం చేసుకోవాలి అనుకుంటే, దర్శనాన్ని ముందుగా ప్లాన్ చేసుకుని, అకామడేషన్, ట్రాన్స్పోర్టేషన్, దర్శనం టిక్కెట్లు వంటివి అన్ని అరెంజ్ చేసుకుని ముందు గానే ప్లాన్ చేసుకోండి.
దర్శనానికి వెళ్లే ముందు తిరుమల వెబ్ సైట్ లో ఇచ్చిన సూచనలు, నియమాలు ఒకసారి చదువుకునే వెళ్ళండి. తిరుమల దర్శనానికి ఫ్యామిలీ తో వెళ్లే సమయం మీ ప్రాధాన్యత మరియు మీ ఛాయస్ బట్టి చేసుకోవచ్చు. కానీ బుక్ చేసుకునే ముందు వాతావరణం, రద్దీ తీవ్రత, వెయిటింగ్ టైం వంటి ఫాక్టర్స్ ని చూస్కోండి.