తిరుమల ఆలయంలో రూ. లక్ష నుంచి రూ. కోటి అంత కన్నా ఎక్కువ నగదు డొనేషన్ ఇస్తారు చాలా మంది భక్తులు. అయితే టీటీడీ వారు అలా డొనేషన్ చేసిన వారికి బహుమతి రూపం లో చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. అవి రూ. 1 లక్ష నుంచి 5 లక్షలు చేసే వారికి కొన్ని రకాల బెనిఫిట్స్ ను అందిస్తోంది. అలాగే 5 లక్షలు అంత కంటే ఎక్కువ డొనేషన్ చేసిన వారికి కొన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తున్నారు. రూ. 10 లక్షలు అంత కంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వారికి మరి కొన్ని రకాల బెనిఫిట్స్ ను ఇస్తున్నారు. ఇప్పుడు మనం రూ. 10 లక్షలు అంత కంటే ఎక్కువ అమౌంట్ డొనేషన్ ఇచ్చిన డోనార్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
రూ. 10 లక్షలు అంత కంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చిన డోనర్ కి టీటీడీ వారి బెనిఫిట్స్ Benefits From TTD For Rs.10 Lakhs & Above Donors
- డోనర్ మరియు వారి యొక్క ఐదుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరం లో మూడు రోజులు రూ. 500 ల VIP Suite రూమ్స్ లో అకామడేషన్ ఫ్రీ ఉంటుంది. లేదా ఈ క్యాటగిరి కి వర్తించే వేరే రూమ్స్ ని ఇస్తారు.
- డోనార్ మరియు 5 కుటుంబ సభ్యులకు సంవత్సరం లో మూడు రోజులు VIP Break Darshan L2 కేటగిరీ లో ఫ్రీ దర్శనం ఉంటుంది.
- డోనార్ కి సంవత్సరం లో ఒకసారి ఆలయాన్ని దర్శించుకున్నపుడు 20 చిన్న లడ్డూల ప్రసాదం ఉచితంగా అందిస్తారు.
- అలాగే డోనార్ సంవత్సరం లో ఒకసారి ఆలయాన్ని దర్శించుకున్నపుడు వారికి ఒక దుపట్టా మరియు ఒక జాకెట్టు ముక్క బహుమానం ఇస్తారు.
- డొనేషన్ తర్వాత డోనార్ మొదటి సారి ఆలయానికి వచ్చినప్పుడు 5 గ్రాముల గోల్డ్ డాలర్ ఒకటి మరియు పద్మావతి సమేత శ్రీవారి చిత్రం ఉన్న గోల్డ్ ప్లేటెడ్ వెండి పతాకం ఒకటి అందిస్తున్నారు.
- సంవత్సరంలో ఒకసారి ఆలయానికి విచ్చేసిన డోనార్ కి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.
- ఈ డొనేషన్స్ కంపెనీలు, సంస్థలు మరియు జాయింట్ డోనార్స్ నుంచి వచ్చినవి అయితే వారికి టీటీడీ వారి బెనిఫిట్స్ 20 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. అదే ఇండివిడ్యువల్ డోనార్స్ అయితే జీవిత కాలం ఉండే అవకాశం ఉంది.