Menu
Arjitha Vasanthothsavam In Tirumala

ఆర్జిత వసంతోత్సవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోత్సవ మండపం లో ప్రతి రోజు నిర్వహించబడే ఒక పవిత్ర సేవ. ఈ సేవ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి దేవతా మూర్తులకు పూజలు నిర్వహిస్తారు. ఈ సేవను చూసి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భక్తులు వైభవోత్సవ మండపానికి తరలి వస్తారు. 

ఈ ఆర్జిత వసంతోత్సవం సేవ భక్తుల ఆధ్యాత్మిక సమయంగా చెప్పవచ్చు. ఈ సేవ భక్తులు స్వామిని పూజించి, స్వామి వారి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఇస్తుంది. వేద పండితులు పవిత్ర మంత్రాలను జపిస్తూ దేవత మూర్తులకి పరిమళ ద్రవ్యాలు మరియు సువాసన ద్రవ్యాలను చల్లడంతో సేవ ప్రారంభమవుతుంది. తర్వాత పవిత్ర జలాలు,  పాలు,పెరుగు, తేనె, పసుపు మరియు చందనం తో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారు.  

ఈ సేవ వసంతోత్సవానికి సంక్షిప్త రూపం. పూజారులు పురుష సూక్తం, నారాయణ సూక్తం, భూ సూక్తం, శ్రీ సూక్తం వంటి పవిత్ర శ్లోకాలను ఉచ్చరిస్తూ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తారు.  ఈ సేవ చివరిలో దేవతా మూర్తుల పైన ఒక జల్లెడ(చిల్లుల పళ్లెం) ను ఉంచి అందులో నుంచి నీటిని పోస్తారు. దీని వల్ల భక్తులకు శుభం ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్ముతారు.   

ఆర్జిత వసంతోత్సవ సేవ రిపోర్టింగ్ ప్లేస్ మరియు సమయం 

ఆర్జిత వసంతోత్సవం సేవ మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. సేవలో పాల్గొనే భక్తులు గంట ముందు అంటే ఉదయం 11:00 గంటలకు సుపధం ప్రవేశం దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ వైభవోత్సవ మండపం లో జరుగుతుంది. 

ఆర్జిత వసంతోత్సవం సేవ  టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ 

ఈ ఆర్జిత వసంతోత్సవం సేవ కి టిక్కెట్టు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు 

  1. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని  వాళ్ళు టీటీడీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
  2. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి “ఆర్జిత సేవ” ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి 
  3. అందులో “ఆర్జిత వసంతోత్సవం” ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి
  4. ఆ తర్వాత మీకు క్యాలెండరు లో కనిపించే డేట్స్ లో గ్రీన్ కలర్ లో డేట్స్ ఉన్నాయా లేదా అని అవైలబిలిటీ ని చెక్ చేసుకోవాలి 
  5. తర్వాత అవైలబుల్ లో ఉన్న డేట్స్ లో మీకు నచ్చిన ఒక డేట్ ను ఎంచుకుని కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
  6.  మీరు ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నారో  నెంబర్ ని ఎంటర్ చేసి మీ పేరు, వయస్సు, ఫోటో ID ప్రూఫ్ , మెయిల్ id , మొబైల్ నెంబర్ మరియు ID కార్డు నెంబర్ వంటి వివరాలు పూర్తి చేయండి.  
  7. కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసి మీ వివరాలను చెక్ చేసుకుని పేమెంట్ మెథడ్ ను సెలెక్ట్ చేసుకోండి. 
  8. “Pay Now” బటన్ పై క్లిక్ చేసి పేమెంట్ ని పూర్తి చేయండి.