ఆర్జిత బ్రహ్మోత్సవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజూ జరిగే ఆర్జిత సేవలలో ఒకటి. “ఆర్జిత” అంటే సంపాదించినది మరియు బ్రహ్మోత్సవం అంటే “దైవిక ఉత్సవం” అని అర్థం. అంటే ఆర్జితం (డబ్బులు) ఇచ్చిన భక్తుల ద్వారా ఈ వేడుకను జరుపుతున్నారు అని అర్థం.
ఈ సేవ ప్రతిరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. 3 గంటల పాటు ఈ సేవ కొనసాగుతుంది. ఈ సేవ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని గర్భ గుడి నుండి బయటికి తీసి బంగారు పల్లకి లో ఉంచడంతో సేవ ప్రారంభమవుతుంది. పూజారులు విగ్రహానికి అభిషేకం చేసి, అలంకారం చేస్తారు. స్వామి వారికి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత గుర్రాలు, ఏనుగులు మరియు రధాల పై ఉంచి ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. స్వామి వారిని తిరిగి గర్భ గుడి లోకి తీసుకు వెళ్లటంతో సేవ ముగుస్తుంది.
ఈ సేవలో పాల్గొనే భక్తులలో పురుషులు ధోతి ధరించాలి మరియు స్త్రీలు చీరలు కానీ చుడిదార్ దుప్పట్టా తో కానీ ధరించాలి. ఈ సేవ బ్రహ్మొత్సవానికి సంక్షిప్త రూపం.
ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ రిపోర్టింగ్ ప్లేస్ మరియు సమయం Arjitha Braahmothsavam Reporting Place & Time
ఈ సేవ ప్రతి రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య వైభవోత్సవ మండపం లో నిర్వహిస్తారు. సేవ లో పాల్గొనే వారు గంట ముందు వైభవోత్సవ మండపం లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ 3 గంటల పాటు కొనసాగుతుంది. సేవ టికెట్ తో ప్రధాన ఆలయం లో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి సుపదం ప్రవేశం ద్వారా వెళ్లవచ్చు.
ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ Arjitha Brahmothsavam Online Booking Procedure
ఈ సేవను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు.