అంగ ప్రదక్షిణ అంటే ఏమిటి? What Does Angapradakshinam Mean?
అంగప్రదిక్షణ అంటే ఆలయం చుట్టూ పడుకుని తిరుగుతూ ప్రదక్షిణ చేస్తారు. అలాగే తిరుమల లో కూడా ఈ సౌకర్యం ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు అంగ ప్రదక్షిణం చేస్తారు. తిరుమలలో అంగప్రదక్షిణకు ఇష్ట పడే భక్తులు కచ్చితంగా తమ ఆధార్ కార్డు తీసుకువెళ్లాలి. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి తర్వాత అంగ ప్రదక్షిణం చేసేందుకు భక్తులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
తిరుమల లో అంగప్రదక్షిణ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? When Will Angapradakshinam Tickets in Tirumala Release?
ఈ అంగప్రదక్షిణ టిక్కెట్లు తిరుమల లోని CRO ఆఫీస్ లో తీసుకోవాలి. ఈ టిక్కెట్లు మధ్యాహ్నం 2 గంటలకు జారీ చేస్తారు. మొత్తం ఇవి 750 టిక్కెట్లు వరకు విడుదల అవుతాయి.
అంగ ప్రదక్షిణ చేసే వారు పాటించాల్సిన నియమాలు Angapradakshinam in Tirumala Rules
మరుసటి రోజు ప్రదక్షిణ కి ముందు రోజే టిక్కెట్టు CRO ఆఫీస్ దగ్గర తీసుకోవాలి. తిరుమలలో మాత్రమే ఈ టిక్కెట్టును అన్ని రోజులు జారీ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 గంటకు భక్తులు స్నానం చేసిన తర్వాత సుపాదం ఎంట్రన్స్ దగ్గర తడి బట్టలతో నివేదించాలి. అంగ ప్రదక్షిణ చేసే ముందు రోజు శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేసి వరాహ స్వామి ఆలయం లో దర్శనం చేసుకుని రావాలి. తర్వాత రోజు తడి బట్టలతో సుపాదం దగ్గరికి చేరుకోవాలి.
తిరుమల అంగప్రదక్షిణ టిక్కెట్టు ధర Angapradakshinam in Tirumala Ticket Price
తిరుమల లో అంగప్రదక్షిణ టిక్కెట్టు కి అమౌంట్ పే చేయనక్కర్లేదు. తిరుమల లోని కౌంటర్ లో అంగప్రదక్షిణ టోకెన్ ఫ్రీ గా ఇస్తారు.
తిరుమల అంగప్రదక్షిణ టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్ Angapradakshinam in Tirumala Online Booking
తిరుమల అంగప్రదక్షిణ టిక్కెట్లు ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. రెండు నెలల ముందే బుక్ చేసుకోవచ్చు. టీటీడీ వెబ్ సైట్ లో అంగప్రదక్షిణ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే క్యాలెండర్ లో గ్రీన్ కలర్ లో ఉన్న డేట్ చెక్ చేసుకుని మీకు నచ్చిన డేట్ లో బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేస్తున్నప్పుడు పేరు, వయస్సు, జెండర్, ఫోటో id ప్రూఫ్, id నెంబర్, అడ్రస్ వంటి మీ పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
తిరుమల అంగప్రదక్షిణ సమయం Angapradakshinam in Tirumala Timings
తెల్లవారుజామున 2:30 గంటలకు మీరు ఆలయం లోపలి వస్తారు. ప్రదక్షిణ ఐన వెంటనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయం లో సుప్రభాత సేవ కూడా భక్తులు తిలకించవచ్చు..