Menu
Accommodation in Tirumala

తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యం అందేలా చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఇవి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే అందులో Padmavathi Guest House, Venkateswara Guest House మరియు Varahaswamy Guest House వంటివి కొన్ని ప్రముఖమైనవి తిరుమలలో ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాము. 

శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా   Sri Padmavathi Guest House Area

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 1.6 KM ల దూరంలో మరియు  తిరుపతి టెంపుల్ బస్సు స్టాండ్ నుంచి 1. 3 KM ల దూరంలో ఉంది ఈ పద్మావతి గెస్ట్ హౌస్.  ఇక్కడ రూమ్ కి  చెక్ ఇన్ మధ్యాహ్నం 3:00 గంటలకు అవ్వాలి. 

పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా రూమ్స్ Padmavathi Guest House Area Rooms

ఈ గెస్ట్ హౌస్ ఏరియా లో రక రకాల రూమ్స్ ఉన్నాయి. అవి తక్కువ ధర లో ఉండే బెస్ట్ రూమ్స్. 

  1. ఆళ్వార్  ట్యాంక్ కాటేజెస్ - తిరుమల శ్రీనివాసుని ఆలయం నుండి కేవలం 1 KM దూరంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్న ఈ  ఆళ్వార్ ట్యాంక్ కాటేజెస్ లో సింగిల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధర రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. 
  2. అంజనాద్రి నగర్ కాటేజెస్ - అంజనాద్రి నగర్ కాటేజెస్ తిరుమల ఆలయం నుండి 1 KM దూరంలో ఉంటుంది. ఈ కాటేజెస్ లో  రూమ్స్ రూ. 50 కె అందుబాటులో ఉన్నాయి. 
  3.  గరుడాద్రి నగర్ కాటేజెస్ - గరుడాద్రి నగర్ కాటేజెస్ తిరుమల ఆలయం నుండి 1.9 KM ల దూరం లో ఉంది. ఇక్కడ రూమ్స్ కేవలం రూ. 50 కే లభ్యం అవుతున్నాయి. 
  4. హిల్ వ్యూ కాటేజెస్ -  ఈ కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.5 KM ల దూరంలో ఉన్నాయి. ఈ హిల్ వ్యూ కాటేజెస్ లో ఆర్డినరీ రూమ్స్ రూ. 50 కే అందుబాటులో ఉన్నాయి.  
  5. మంగళ బావి కాటేజెస్ -  తిరుమల ఆలయానికి సమీపంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్నాయి ఈ మంగళ బావి కాటేజెస్. ఈ కాటేజెస్ లో 2 suites రూమ్స్ రూ. 100  కి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 4 కాటేజెస్ రూమ్స్ రూ. 200 కె అందుబాటులో ఉన్నాయి. 
  6. రామ్ బగీచా గెస్ట్ హౌస్ I  - పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్న రామ్ బగీచా గెస్ట్ హౌస్ తిరుమల ఆలయానికి కేవలం 1.9 KM ల దూరంలో ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్స్ రూ. 100 కే లభ్యం అవుతాయి.  
  7. రామ్ బగీచా గెస్ట్ హౌస్ II  - తిరుమల ఆలయానికి చేరువలో కేవలం 25 m ల దూరం లో ఉంది ఈ రామ్ బగీచా గెస్ట్ హౌస్ II. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్స్ రూ. 100 కే లభిస్తాయి. 
  8. రామ్ బగీచా గెస్ట్ హౌస్ III  - ఈ రామ్ బగీచా గెస్ట్ హౌస్ III తిరుమల శ్రీనివాసుని ఆలయానికి 250 m ల దూరం లోనే ఉంది. ఇందులో రూమ్స్ కేవలం  రూ. 100 కే అందుబాటులో ఉన్నాయి. 
  9.   శంఖు మిట్ట కాటేజెస్ - తిరుమల ఆలయానికి అత్యంత చేరువలో కేవలం 750 m ల దూరం లో శంఖు మిట్ట కాటేజెస్ ఉన్నాయి. ఇందులో రూమ్స్ కేవలం రూ. 50 కే అందుబాటులో ఉన్నాయి.  
  10.  శేషాద్రి నగర్ కాటేజెస్-  శేషాద్రి నగర్ కాటేజెస్ తిరుమల శ్రీనివాస ఆలయం నుండి 1.2 KM ల దూరం లో ఉంది. ఈ కాటేజెస్ లో రూమ్స్ రూ. 50 కి లభ్యం అవుతాయి. 
  11.  టీబీ కాటేజెస్ 2 suites - ట్రావెల్లర్ బంగ్లా కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.3 KM ల దూరం లో ఉంది. ఈ కాటేజెస్ లో 2 suites   రూ. 200 కె అందుబాటులో ఉన్నాయి. 
  12.  సింగిల్ రూమ్స్- పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో సింగిల్ రూమ్స్ రూ. 50 కే లభ్యం అవుతాయి. 
  13. ఔట్ సైడ్ కాటేజెస్ - పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఆలయానికి సమీపంలో ఉన్నాయి ఈ అవుట్ సైడ్ కాటేజెస్. ఇందులో రూమ్స్ కేవలం రూ. 100 లకే అందుబాటులో ఉన్నాయి. 
  14. వాలీ వ్యూ కాటేజెస్ - వాలీ వ్యూ కాటేజెస్ తిరుమల ఆలయానికి కేవలం 1. 5 KM ల దూరం లో నే ఉన్నాయి. ఈ కాటేజెస్ లో 6 suites రూమ్స్ రూ. 100 నుంచి రూ. 200 వరకు అందుబాటులో ఉన్నాయి. 

శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్  Sri Venkateswara Guest House 

శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ తిరుమల టెంపుల్ బస్సు స్టాండ్ కు 2. 2 KM ల దూరంలో ఉంది. తిరుమల ఆలయం  కూడా కేవలం 1. 8 KM ల దూరం లోనే ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్ కి మధ్యాహ్నం 2:00 గంటలకు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 

శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ రూమ్స్ Sri Venkateswara Guest House Rooms

శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ లో మూడు రకాల రూమ్స్ ఉన్నాయి.  అవి  ఆళ్వార్ ట్యాంక్ cottage రూమ్స్, సంకు మిట్ట cottage రూమ్స్ మరియు ట్రావెల్లెర్స్ బంగ్లా cottage రూమ్స్. వీటన్నిటికీ ఒక రూమ్ ధర కేవలం రూ. 200 మాత్రమే. 

వరాహస్వామి గెస్ట్ హౌస్  Varahaswamy Guest House

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2.2  KM ల దూరంలో మరియు తిరుపతి టెంపుల్ బస్సు స్టాండ్ కి 2.7 KM ల దూరంలో ఉంది ఈ  గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ కి చెక్ ఇన్ మరియు చెక్ అవుట్ సమయం 24 hours ఉంటుంది.  అంటే ఇవాళ ఉదయం 7 గంటలకు చెక్ ఇన్ అయితే, రేపు ఉదయం 7 గంటలకు చెక్ అవుట్ చేయాలి. మనం ఏ సమయం లో ఐన చెక్ ఇన్ అవ్వచ్చు. 

శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ రూమ్స్  Sri Varaha Swamy Guest House Rooms

ఈ గెస్ట్ హౌస్ లో చాలా రకాల రూమ్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

  1. అంప్రో కాటేజెస్ - వరాహ స్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్న అంప్రో కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.3 KM ల దూరం లో ఉన్నాయి. ఇందులో 2 బిగ్ suite రూమ్స్ రూ. 1500 కి లభ్యం అవుతాయి. అలాగే 1 స్మాల్ suite రూమ్స్ రూ. 750 లకే అందుబాటులో ఉన్నాయి.
  2. బాల కుటీరం AC - తిరుమల శ్రీనివాస ఆలయం నుండి 1.3 KM ల దూరం లో ఉంది ఈ బాల కుటీరం. ఇందులో ఉన్న 6 suites AC రూమ్స్ కేవలం రూ. 500 లకే అందుబాటులో ఉన్నాయి.  
  3. గాయత్రి సదన్ - గాయత్రి సదన్ వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో తిరుమల ఆలయానికి 1.2 KM ల దూరం లో ఉంది. ఇందులో రూమ్స్ రూ. 1500 నుంచి రూ. 2500 ల ప్రైస్ రేంజ్ లో లభ్యం అవుతాయి.  
  4. హరి సదన్ గెస్ట్ హౌస్ / చౌల్ట్రీ - ఈ గెస్ట్ హౌస్ తిరుమల ఆలయం నుంచి 1.4 KM ల దూరం లో వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉంది. ఇందులో ఉన్న 7 suites AC రూమ్స్ రూ. 1500 కి అందుబాటులో ఉన్నాయి. 
  5. హిల్ వ్యూ - ఈ హిల్ వ్యూ కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.5 KM ల దూరం లో ఉన్నాయి. ఇందులో డీలక్స్ కాటేజెస్ రూమ్స్ రూ. 1500 కి, బిగ్ suites రూమ్స్ రూ.150 లకు మరియు స్మాల్ suites రూమ్స్ కేవలం రూ. 100 లకే అందుబాటులో ఉన్నాయి.
  6. ఇందిరా గెస్ట్ హౌస్ - ఇందిరా గెస్ట్ హౌస్ వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో తిరుమల శ్రీవారి ఆలయానికి 1.2 KM ల దూరం లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో  4 AC suites ల రూమ్స్ రూ. 2000 లకు అందుబాటులో ఉన్నాయి. 
  7. జగన్నాధ భవన్ - శ్రీనివాస ఆలయానికి అత్యంత చేరువలో కేవలం 750m లో ఉంది ఈ జగన్నాధ భవన్. ఇందులో రూ.2500 ల నుంచి రూ. 3500 వరకు ఉన్న ప్రైస్ రేంజ్ లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. 
  8. శ్రీనివాస్ JK గెస్ట్ హౌస్ - తిరుమల ఆలయానికి 1.3 KM ల దూరం లో ఉంది ఈ గెస్ట్ హౌస్. ఇందులో రూమ్స్ రూ. 1500 ల నుంచి రూ.2500 ల రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. 
  9. లక్ష్మీ నివాస్ - లక్ష్మీ నివాస్ తిరుమల ఆలయం నుంచి కేవలం 850 m ల దూరంలో వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉంది. ఈ లక్ష్మి నివాస్ లో రూమ్స్ రూ. 500 ల నుంచి రూ. 600 ల రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి.
  10. రాజ్యలక్ష్మి గెస్ట్ హౌస్ - తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1.2 KM ల దూరంలో ఉంది ఈ గెస్ట్ హౌస్. ఇందులో AC రూమ్స్ రూ. 1000, రూ. 2500, రూ. 3000 మరియు రూ. 3500 వంటి రేంజ్ లలో ఉన్నాయి. 
  11. SP గెస్ట్ హౌస్ - శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుమల ఆలయం నుంచి 1.5 KM ల దూరంలో ఉంది. ఇందులో రూమ్స్ రూ. 1500 ల నుంచి రూ. 2500 ల రేంజ్ లో లభ్యం అవుతాయి.
  12. శ్రీనికేతన్ - ఇది వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియా లో తిరుమల ఆలయానికి సమీపంలో ఉంది. ఇందులో ఉన్న AC రూమ్స్ రూ.6000 కి అందుబాటులో ఉన్నాయి. 
  13. శ్రీనివాస నిలయం - ఈ శ్రీనివాస నిలయం తిరుమల ఆలయానికి దగ్గరలో ఉంది. ఇందులో ఉన్న AC రూమ్స్ రూ. 2500 ల నుంచి రూ. 3500 ల రేంజ్ లో లభ్యం అవుతాయి. 
  14. వెంకట విజయం గెస్ట్ హౌస్ - తిరుమల శ్రీవారి ఆలయం నుండి 2.9 KM ల దూరంలో ఉంది ఈ గెస్ట్ హౌస్. ఇందులో  ఉన్న AC రూమ్స్ 3 మాస్టర్ suites రూ. 2500 లకు మరియు  6 other suites రూ. 1500 లకు అందుబాటులో ఉన్నాయి.
  15. విద్యా సదన్- విద్యా బాల సదన్ తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1.2 KM ల దూరం లో ఉంది. ఇందులో ఉన్న రూమ్స్ రూ.1500 ల కే లభ్యం అవుతాయి.  

కాటేజెస్ Cottages

 తిరుమలలో ఇలా గెస్ట్ హౌస్ లే కాక  ఇంకా cottage రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ రూమ్స్ కూడా తిరుమల ఆలయానికి తక్కువ దూరంలో ఉంటాయి. ఇందులో స్పెషల్ టైప్ cottages, శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ corner suite, ట్రావెల్లెర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్ I, II, III corner suite రూమ్స్, సురపురం తోట cottages వంటి రక రకాల రూమ్స్ ఉన్నాయి. అయితే ఈ రూమ్స్ ధర రూ. 200 ల నుంచి రూ. 1500 వరకు ఉన్నాయి. 

  1. శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ - ఈ గెస్ట్ హౌస్ తిరుమల శ్రీనివాస ఆలయానికి 1.6 KM ల దూరంలో ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో ఉన్న కార్నర్ suite రూమ్స్ రూ. 100, రూ. 150 మరియు రూ. 200 ల రేంజ్ లో లభ్యం అవుతాయి. 
  2. స్పెషల్ టైప్ కాట్టేజ్ AC - 5 - ఈ కాట్టేజ్ తిరుమల ఆలయానికి సమీప దూరంలో ఉంది. ఇందులో రూమ్స్ రూ. 750 ల కే లభ్యం అవుతాయి. స్పెషల్ టైప్ కాట్టేజ్ AC - 12 - ఈ కాట్టేజ్ తిరుమల ఆలయానికి సమీప దూరంలో ఉంది. ఇందులో రూమ్స్ రూ. 750 ల కే లభ్యం అవుతాయి. స్పెషల్ టైప్ కాట్టేజ్ AC - 13 - ఈ కాట్టేజ్ తిరుమల ఆలయానికి సమీప దూరంలో ఉంది. ఇందులో రూమ్స్ రూ. 750 ల కే లభ్యం అవుతాయి.స్పెషల్ టైప్ కాట్టేజ్ AC - 17 -  ఈ కాట్టేజ్ తిరుమల ఆలయానికి సమీప దూరంలో ఉంది. ఇందులో ఉన్న HRG ‘A’ Portion, HRG ‘B’ Portion మరియు MBC కాటేజెస్(నెంబర్ 20 & 22) వంటి రకాల రూమ్స్ రూ. 600 ల కే లభ్యం అవుతాయి. 
  3. ట్రావెల్లర్ బంగ్లా కాటేజెస్ - ఈ కాటేజెస్ తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1.3 KM ల దూరం లో ఉన్నాయి. ఇందులో ఉన్న రూమ్స్ రూ. 50, రూ. 100, రూ. 200 మరియు రూ. 500 వంటి ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. 
  4. నారాయణగిరి గెస్ట్ హౌస్/ రెస్ట్ హౌస్ 2 -  తిరుమల ఆలయానికి 3.5 KM ల దూరంలో ఉంది ఈ రెస్ట్ హౌస్.  ఈ రెస్ట్ హౌస్ లో రూమ్స్ రూ. 1500 నుంచి రూ. 2000 ల ప్రైస్ రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. 
  5. నారాయణగిరి గెస్ట్ హౌస్/ రెస్ట్ హౌస్ 3 -  ఈ నారాయణగిరి రెస్ట్ హౌస్ 3 తిరుమల శ్రీవారి ఆలయానికి 1.8 KM ల దూరం లో ఉంది. ఇందులో రూ. 1500 నుంచి రూ. 2000 ల వరకు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. 
  6. నారాయణగిరి గెస్ట్ హౌస్/ రెస్ట్ హౌస్ 4 - ఈ గెస్ట్ హౌస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.7 KM ల దూరంలో ఉంది. ఇక్కడ రూ. 1500 ల నుంచి రూ. 2500 ల రేంజ్ లో రూమ్స్ లభ్యం అవుతాయి. 
  7. శ్రీవారి కుటీర్ గెస్ట్ హౌస్ - శ్రీవారి కుటీర్ గెస్ట్ హౌస్ తిరుమల ఆలయం నుంచి 2 KM ల దూరం లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో ఉన్న 1 నెంబర్ నుంచి 4 వ నెంబర్ వరకు AC suite రూమ్స్ రూ. 1500 ల కి లభిస్తాయి. 
  8. సురపురం తోట కాటేజెస్ - తిరుమల శ్రీవారి ఆలయానికి అత్యంత చేరువలో కేవలం 300 m ల దూరంలో ఉంది ఈ కాటేజ్. ఇందులో రూమ్స్ రూ. 1500 ల కే అందుబాటులో ఉన్నాయి. 

గెస్ట్ హౌస్ రూమ్స్ బుకింగ్ ప్రక్రియ  Guest House Rooms Booking Procedure 

ఇప్పుడు మనం ఈ గెస్ట్ హౌస్ అన్నిటిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ రూమ్స్ మనం ఆన్లైన్ మరియు offline రెండు విధాలుగా చేసుకోవచ్చు. 

ఆన్లైన్ రూమ్ బుకింగ్ ప్రక్రియ Online Room Booking Procedure

ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకునే ముందు కచ్చితంగా మీరు దర్శనం టిక్కెట్టు తీసుకోవాలి. దర్శనం టిక్కెట్టు ఉంటేనే మీరు రూమ్స్ బుక్ చేసుకోగలరు. ఈ రూమ్స్ మీరు దర్శనం డేట్ రోజున, దర్శనం డేట్ ముందు రోజు లేదా దర్శనం డేట్ తర్వాత రోజు రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు రూమ్స్ ని దర్శనం టిక్కెట్టు బుక్ చేసుకున్న డేట్ కు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ బుక్ చేసుకోవచ్చు. టీటీడీ  అఫీషియల్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి నెల రోజుల ముందే రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ పూర్తి చేయగానే మీకు ఒక రిసిప్ట్  వస్తుంది. దాన్ని తిరుమల కొండ పైన ఉన్న CRO ఆఫీస్ పక్కన ఉన్న ERP కౌంటర్ దగ్గర చూపించాలి. ఆ రిసిప్ట్ లో ఉన్న కోడ్ ను స్కాన్ చేసి మీకు రూమ్స్ అలాట్  చేస్తారు. అక్కడ ప్రింట్ అవుట్ సబ్మిట్ చేయాలి. స్లాట్ చేసిన టైం కన్నా ముందే అక్కడికి వెళ్ళాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాట్, 12 గంటల నుండి 5 గంటల వరకు ఒక స్లాట్ ఉంటాయి.  మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. 

మీరు రూమ్ బుకింగ్ ని ఇంకొక రోజు కి పొడిగించుకోవాలి అనుకుంటే CRO ఆఫీస్ దగ్గర రిక్వెస్ట్ చేసుకోవచ్చు. 

ఆఫ్లైన్ రూమ్ బుకింగ్ ప్రక్రియ Offline Room Booking Procedure

ఆఫ్లైన్ బుకింగ్ ఐతే తిరుమల కొండ పైన ఉన్న CRO ఆఫీస్ దగ్గర రూమ్ బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి మీ ID కార్డు( ఆధార్ కార్డు), మొబైల్ నెంబర్  ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు స్కాన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సుమారు రెండు గంటల తర్వాత మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఆ కౌంటర్ దగ్గర మీకు రూమ్ availability స్క్రీన్ మీద చూపిస్తుంది అందులో మీకు కావాల్సిన రూమ్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు. 

https://www.youtube.com/watch?v=yEjr7Z_hXQ8

తిరుమలలో ముందుగా చేసుకునే రూమ్ బుకింగ్ Accommodation At Tirumala Advance Booking

తిరుమలలో రూమ్స్ మనం ముందుగా బుక్ చేసుకోవచ్చు. అయితే ఒక లాగిన్ ID తో ఒక రూమ్ మాత్రమే అడ్వాన్స్డ్ గా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ రూమ్స్ 90 రోజుల లోపు ఉన్న అవైలబిలిటీ కోట లో మాత్రమే కేటాయిస్తారు.