Menu
Accommodation For Common Piligrims Tirumala

తిరుమల ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నివాసం ఉండటం కోసం టీటీడీ వారు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అవి VIP కి కొన్ని సామాన్యులకు కొన్ని రకాల రూమ్స్ ని ఏర్పాటు చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధర లో అన్ని సౌకర్యాలతో అందించేలా అకామడేషన్ ఏర్పాటు చేశారు. అదే విధంగా కొన్ని రూమ్స్ VIP కేటగిరీ భక్తులకు ఏర్పాటు చేశారు.

సాధారణంగా కొంతమంది శ్రీవారి దర్శనం తర్వాత కూడా తిరుమల నివాసం ఉండాలి అనుకుంటారు. అయితే ఈ రూమ్స్ తిరుమల మాత్రమే కాక తిరుపతి లో కూడా ఉంటాయి.  ఇప్పుడు తిరుమల లో ఉండే రూమ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. తిరుమలలో రూమ్స్ రూ. 50 నుంచి రూ. 1500 వరకు ఉంటాయి. 

శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్, ట్రావెల్లెర్స్ బంగ్లా కాటేజస్ మరియు శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ వంటి అకామడేషన్ తిరుమల లో ఉన్నాయి. 
ఆ అకామడేషన్ లో ఉన్న రూమ్స్ ఇవి:

తిరుమలలో ఉన్న రూమ్స్ వివరాలు:

శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ 

శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రూమ్స్ వాటి ధర చూద్దాం. 

  1. ఆళ్వార్  ట్యాంక్ కాటేజెస్ - తిరుమల శ్రీనివాసుని ఆలయం నుండి కేవలం 1 KM దూరంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్న ఈ  ఆళ్వార్ ట్యాంక్ కాటేజెస్ లో సింగిల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధర రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. 
  2. అంజనాద్రి నగర్ కాటేజెస్ - అంజనాద్రి నగర్ కాటేజెస్ తిరుమల ఆలయం నుండి 1 KM దూరంలో ఉంటుంది. ఈ కాటేజెస్ లో  రూమ్స్ రూ. 50 కె అందుబాటులో ఉన్నాయి. 
  3.  గరుడాద్రి నగర్ కాటేజెస్ - గరుడాద్రి నగర్ కాటేజెస్ తిరుమల ఆలయం నుండి 1.9 KM ల దూరం లో ఉంది. ఇక్కడ రూమ్స్ కేవలం రూ. 50 కే లభ్యం అవుతున్నాయి.
  4. హిల్ వ్యూ కాటేజెస్ -  ఈ కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.5 KM ల దూరంలో ఉన్నాయి. ఈ హిల్ వ్యూ కాటేజెస్ లో ఆర్డినరీ రూమ్స్ రూ. 50 కే అందుబాటులో ఉన్నాయి.  
  5. మంగళ బావి కాటేజెస్ -  తిరుమల ఆలయానికి సమీపంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్నాయి ఈ మంగళ బావి కాటేజెస్. ఈ కాటేజెస్ లో 2 suites రూమ్స్ రూ. 100  కి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 4 కాటేజెస్ రూమ్స్ రూ. 200 కె అందుబాటులో ఉన్నాయి. 
  6. రామ్ బగీచా గెస్ట్ హౌస్ I  - పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఉన్న రామ్ బగీచా గెస్ట్ హౌస్ తిరుమల ఆలయానికి కేవలం 1.9 KM ల దూరంలో ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్స్ రూ. 100 కే లభ్యం అవుతాయి.  
  7. రామ్ బగీచా గెస్ట్ హౌస్ II  - తిరుమల ఆలయానికి చేరువలో కేవలం 25 m ల దూరం లో ఉంది ఈ రామ్ బగీచా గెస్ట్ హౌస్ II. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్స్ రూ. 100 కే లభిస్తాయి. 
  8. రామ్ బగీచా గెస్ట్ హౌస్ III  - ఈ రామ్ బగీచా గెస్ట్ హౌస్ III తిరుమల శ్రీనివాసుని ఆలయానికి 250 m ల దూరం లోనే ఉంది. ఇందులో రూమ్స్ కేవలం  రూ. 100 కే అందుబాటులో ఉన్నాయి. 
  9.  శంఖు మిట్ట కాటేజెస్ - తిరుమల ఆలయానికి అత్యంత చేరువలో కేవలం 750 m ల దూరం లో శంఖు మిట్ట కాటేజెస్ ఉన్నాయి. ఇందులో రూమ్స్ కేవలం రూ. 50 కే అందుబాటులో ఉన్నాయి.  
  10.  శేషాద్రి నగర్ కాటేజెస్-  శేషాద్రి నగర్ కాటేజెస్ తిరుమల శ్రీనివాస ఆలయం నుండి 1.2 KM ల దూరం లో ఉంది. ఈ కాటేజెస్ లో రూమ్స్ రూ. 50 కి లభ్యం అవుతాయి. 
  11.  టీబీ కాటేజెస్ 2 suites - ట్రావెల్లర్ బంగ్లా కాటేజెస్ తిరుమల ఆలయానికి 1.3 KM ల దూరం లో ఉంది. ఈ కాటేజెస్ లో 2 suites   రూ. 200 కె అందుబాటులో ఉన్నాయి. 
  12.  సింగిల్ రూమ్స్- పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో సింగిల్ రూమ్స్ రూ. 50 కే లభ్యం అవుతాయి. 
  13. ఔట్ సైడ్ కాటేజెస్ - పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా లో ఆలయానికి సమీపంలో ఉన్నాయి ఈ అవుట్ సైడ్ కాటేజెస్. ఇందులో రూమ్స్ కేవలం రూ. 100 లకే అందుబాటులో ఉన్నాయి. 
  14. వాలీ వ్యూ కాటేజెస్ - వాలీ వ్యూ కాటేజెస్ తిరుమల ఆలయానికి కేవలం 1. 5 KM ల దూరం లో నే ఉన్నాయి. ఈ కాటేజెస్ లో 6 suites రూమ్స్ రూ. 100 నుంచి రూ. 200 వరకు అందుబాటులో ఉన్నాయి. 

 శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ 

శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ లో ఉన్న రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రూమ్స్ వాటి ధర చూద్దాం. 

  1. ఆళ్వార్ ట్యాంక్ కాటేజెస్ - ఈ కాటేజెస్ తిరుమల శ్రీనివాస ఆలయానికి 1 KM ల దూరం లో ఉంది. ఇందులో రూమ్స్ కేవలం రూ. 200 ల కే అందుబాటులో ఉన్నాయి. 
  2. శంఖు మిట్ట కాటేజెస్ -  ఈ కాటేజెస్ తిరుమల ఆలయానికి 750 m ల  దూరంలో ఉన్నాయి. ఇందులో రూమ్స్ రూ. 200 ల కే  లభిస్తాయి. 
  3. ట్రావెల్లర్ బంగ్లా కాటేజ్ - తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1.3 KM ల దూరం లో ఈ  కాటేజ్  ఉంది.  ఈ కాటేజ్ లో రూమ్స్ కేవలం రూ. 200 ల కే లభ్యం అవుతాయి. 

ట్రావెలర్ బంగ్లా కాటేజెస్  

ట్రావెల్లర్ బంగ్లా కాటేజెస్ లో ఉన్న రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రూమ్స్ వాటి ధర చూద్దాం. 

ట్రావెల్లర్ బంగ్లా కాటేజెస్ - ఈ కాటేజెస్ తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1.3 KM ల దూరం లో ఉన్నాయి. ఇందులో ఉన్న రూమ్స్ రూ. 50, రూ. 100, రూ. 200 మరియు రూ. 500 వంటి ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి.

ఇలా చాలా రకాల రూమ్స్ తిరుమల లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ రూమ్స్ ని offline లో CRO ఆఫీస్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. 

తిరుమల రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ